Chiranjeevi డాన్స్ లో స్టైల్ కనపడటానికి కారణం ఎవరో తెలుసా?
Chiranjeevi Dance Style : అభిమాన నటుల గురించి తెలుసుకోవాలని ప్రతి అభిమాని అనుకుంటాడు. సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి రాకముందు ఒక లెక్క,వచ్చాక మరోలెక్క అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా డాన్స్ లతో ఉర్రూతలూగించిన చిరంజీవికి కోట్లాదిమంది అభిమానులున్నారు. వెరైటీ స్టెప్స్ తో ఫాన్స్ కి హుషారెత్తించిన చిరంజీవి చాలా మంది నటులకు స్ఫూర్తి కూడా.
అందుకే యువ హీరోలు స్టెప్స్ మీద దృష్టిపెట్టారు. ఇలా ఎంతోమంది చిరంజీవి డాన్స్ ని పొగిడితే,ఒక వ్యక్తి మాత్రం విమర్శించారు. దాంతో కసితో కొత్త ఒరవడితో స్టెప్స్ చేసి అందరి మన్ననలను చిరంజీవికి వీలైందని అంటారు. ఆ వివరాల్లోకి వెళ్తే,ఓ సినిమా షూటింగ్ జరుగు తుండగా, చిరంజీవి మీద డాన్స్ సాంగ్ చిత్రీకరణ చేస్తున్నారు.
కట్ చెప్పాక అక్కడున్న వారంతా క్లాప్స్ కొట్టారు. అక్కడ మేనేజర్ గా ఉన్న వెంకన్న బాబు తదేకంగా చూస్తూ ఉండడంతో డాన్స్ ఎలా చేశానని చిరంజీవి అడిగారట.
ఏముంది, నీ వెనుక ఉన్న డాన్సర్లు ఏమి చేశారో నువ్వూ అదే చేసావ్ అని వెంకన్నబాబు అన్నారట. నీకంటూ కొత్త స్టైల్ వుండాలని అన్నారట. దాంతో డాన్స్ మాస్టర్లు చెప్పింది మాత్రమే కాకుండా అదనంగా ఏదో చేయాలనీ చిరంజీవికి అన్పించిందట. దాంతో బీట్ ఏదైనా తనదైన మార్క్ వేస్తూ అభిమానులను ఉర్రూతలూగించారు.