Mahesh babu సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాని మిస్ చేసుకున్న నటుడు ఎవరో…?
Mahesh babu seethamma vakitlo sirimalle chettu movie : సినీ ప్రపంచంలో ఎన్నో మాయలు జరుగుతూ ఉంటాయి. సినిమా కథలు రాసినపుడే ఫలానా పాత్రకి ఫలానా వాళ్ళని అనుక్కోవడం సహజం. తీరా సినిమా పట్టాలెక్కే సమయానికి మరో వ్యక్తి ఆ పాత్రలో దర్శనమిస్తాడు. ఇలా చాలా సినిమాల్లో జరుగుతూ ఉంటుంది. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ వుంది. ఇక్కడ మార్కెట్ లో మంచి షేర్ రాబట్టగలడు.
అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన పెదరాయుడు మూవీ ఎంతటి హిట్ అయిందో తెల్సిందే. ఇందులో రజనీకాంత్ గెస్ట్ రోల్ చేసి, అదరగొట్టాడు. సినిమాకు ఇది అదనపు బలంగా మారింది. అలాగే విక్టరీ వెంకటేష్,సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో కూడా ప్రకాష్ రాజ్ నటించిన పాత్ర బాగా కుదిరింది.
విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్ పలు సినిమాల్లో మెప్పించడమే కాదు,తెలుగు,తమిళ,కన్నడ మూవీస్ లో కూడా నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో ఇద్దరు హీరోలకు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ ఒదిగిపోయాడు. అతడు చెప్పే మంచి మాటలు జనానికి బాగా కనెక్ట్ అయ్యాయి. అయితే ఈ పాత్రకోసం మొదట్లో రజనీకాంత్ ని అనుకున్నారట. ఎందుకో తేడా రావడంతో ప్రకాష్ రాజ్ కి ఆ ఛాన్స్ దక్కింది.