ఈ పొడి ఇలా వాడితే క్షణాల్లో గాఢనిద్ర పడుతుంది…జీవితంలో నిద్రలేమి సమస్య ఉండదు
Nidra lemi samasya in telugu : ఇంటి చిట్కాలను జాగ్రత్తగా ఫాలో అయితే మంచి పలితాలు వస్తాయి. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. మనిషికి దాదాపుగా 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే శారీరక,మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. పని ఒత్తిడి, నైట్‌అవుట్స్, మొబైల్ ఫోన్స్, టి.వి ఎక్కువగా చూడటం వంటి కారణాలతో నిద్ర సరిగా పట్టదు.
సరైన నిద్ర లేకపోతే అలసట, చికాకు, ఒత్తిడి, గ్యాస్ట్రిక్, జీర్ణ సంబంద సమస్యలు, బద్ధకం, ఏకాగ్రత లేకపోవడం, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. నిద్ర పట్టటానికి అసలు మందుల జోలికి వెళ్లకూడదు. సహజసిద్దమైన చిట్కాలతో మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చు. కాస్త ఓపికగా చిట్కాలను పాటించాలి.
మంచి నిద్రకు ఒక పొడి తయారుచేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 100 గ్రాముల బాదం పప్పు తీసుకొని పాన్ లో వేసి డ్రై గా వెగించి మిక్సీ జార్ లో వేసి పొడి గా చేసుకోవాలి. అలాగే 50 గ్రాముల గసగసాలను కూడా వేగించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత 50 గ్రాముల గుమ్మడి గింజలను కూడా తీసుకొని వేగించి పొడి చేసుకోవాలి.
ఆ తర్వాత 150 గ్రాముల ఎండు ఖర్జూరం తీసుకొని దానిలో గింజలను తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఒక బౌల్ లో బాదం పప్పు పొడి,గసగసాల పొడి,గుమ్మడి గింజల పొడి, ఖర్జూరం పొడి వేసి అన్నీ బాగా కలిసేలా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఫ్రిజ్ లో పెడితే 15 రోజులు నిల్వ ఉంటుంది.
ప్రతి రోజు రాత్రి పడుకోవటానికి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ పొడి కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. వారం రోజుల పాటు ఈ పొడిని తీసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. వీటిలో ఉండే పోషకాలు నిద్ర బాగా పట్టేలా చేస్తాయి. కాబట్టి నిద్రలేమి సమస్యతో బాధపడే వారు ఈ పొడిని వాడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.