MoviesTollywood news in telugu

BalaKrishnaకు బాగా సెట్ అయినా TOP 10 హీరోయిన్ లు ఎవరో…?

Tollywood Hero BalaKrishna : బాలకృష్ణ NTR వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మాస్ హీరోగా ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అయ్యాడు. అయితే ఇతడి విజయం వెనుక కొందరు హీరోయిన్స్ ఉన్నారు. ఎందుకంటే బాలయ్యకు సరైన జోడీ అనిపించుకోవడం వలన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.

అందులో ప్రధానంగా తీసుకుంటే, మొదటగా లేడీ అమితాబ్ విజయశాంతిని ప్రస్తావించాలి. ముద్దుల మావయ్య, లారీడ్రైవర్, ఇన్స్పెక్టర్ రౌడీ, నిప్పురవ్వ, కథానాయకుడు, భానుమతి గారి మొగుడు వంటి మూవీస్ లో బాలయ్యకు సరైన జోడీగా విజయశాంతి నిల్చింది.

అలాగే అల్లరి కృష్ణయ్య, అనసూయమ్మగారి అల్లుడు, అపూర్వ సహోదరులు ఇలా పలు సినిమాల్లో బాలయ్యతో భానుప్రియ జోడీ కట్టి అలరించింది.బాలయ్యకు తొలి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మంగమ్మగారి మనవడు మూవీ నుంచి బాలగోపాలుడు, ప్రెసిడెంట్ గారబ్బాయి వంటి సినిమాల్లో సుహాసిని చేసిన నటన సూపర్. దొంగరాముడు ,రాముడు భీముడు, ముద్దుల కృష్ణయ్య, పట్టాభిషేకం, ఇలా పలు సినిమాల్లో బాలయ్యకు చురుకైన జోడీగా రాధ నిల్చింది.

బాలయ్య సరసన భైరవ ద్వీపం, మాతో పెట్టుకోకు, పెద్దన్నయ్య, గాండీవం, వంటి మూవీస్ లో రోజా సరైన జోడీగా ఫాన్స్ మదిలో నిలిచారు. అందాల నటి రజని కూడా బాలయ్యకు సరైన జోడీ అనిపించుకుంది. సీతారామ కళ్యాణం, రాము, ప్రాణానికి ప్రాణం, భార్యాభర్తల బంధం ఇలా పలు సినిమాల్లో బాలయ్య సరసన నటించి మెప్పించింది.

ఇక బాలయ్యతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సమరసింహారెడ్డి సినిమాలో నటించిన సిమ్రాన్ ఆతర్వాత నరసింహనాయుడు, సీమ సింహం ఇలా పలు సినిమాల్లో నటించి, ఈ జంట ఆకట్టుకుంది. వంశానికొక్కడు, వంశోద్ధారకుడు, బంగారు బుల్లోడు సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ కూడా బాలయ్యకు సరిజోడు అనిపించుకుంది.

ముద్దుల మొగుడు, కృష్ణబాబు, అశ్వమేధం వంటి సినిమాల్లో బాలయ్య సరసన మీనా కూడా బాగానే ఆకట్టుకుంది. ఇక శ్రీరామ రాజ్యం మూవీలో బాలయ్య రాముడు వేషం వేస్తే, సీతమ్మగా నయనతార అలరించి చూడచక్కని జంట అనిపించుకున్నారు. సింహా వంటి మూవీస్ లో బాలయ్య సరసన ఆమె నటన సూపర్భ్.