ఇంటి చుట్టుపక్కల కనిపించే ఈ మొక్క ప్రయోజనాలేమిటో తెలుసా..? తెలిస్తే అసలు వదలరు
Billa Ganneru Benefits in telugu : మన ఇంటి చుట్పింటుపక్క్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. మరియు తెలుగు రంగులో ఉండే బిళ్ళ గన్నేరు మొక్క దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. ఈ మొక్కను చాలా మంది అలంకరణ మొక్కగా భావిస్తారు. ఈ మొక్క పూలను ఎక్కువగా అలంకరణలో వాడుట వలన చాలా మందికి బిళ్ళ గన్నేరు అలంకరణ మొక్కగానే తెలుసు. బిళ్ళ గన్నేరు 365 రోజులు జీవితకాలం అంతా ప్రతిరోజూ పువ్వులు పూస్తుంది
కాబట్టి దీనిని నిత్య పుష్పి, సదా పుష్పి, సదా బహార్, అనే పేర్లు వున్నాయి ఈ మొక్కలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క ఆకులు, పువ్వులు, వేర్లు అన్నీ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు ఈ మొక్క చెక్ పెట్టగలదు.
మరి ఈ మొక్క వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. గాయాలు అయినప్పుడు నాలుగు బిళ్ళ గన్నేరు ఆకులను పేస్ట్ గా చేసి గాయాలపై రాస్తే తొందరగా తగ్గుతాయి. అయితే రోజులో రెండు లేదా మూడు సార్లు బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ రాయాల్సి ఉంటుంది. బిళ్ళ గన్నేరు మధుమేహం ఉన్నవారికి దివ్య ఔషధం అని చెప్పవచ్చు.
బిళ్ళ గన్నేరు వేళ్ళను సేకరించి శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి పొడిగా తయారుచేసుకోవాలి. అర గ్రాము పొడిని ఒక స్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే మధుమేహం తగ్గుతుంది. అయితే ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున, రాత్రి ఆహారం తినే ముందు రోజుకు రెండు సార్లు తీసుకుంటే మధుమేహం నయం అవుతుంది.
5 బిళ్ళ గన్నేరు ఆకులను బాగా కడిగి రసం తీయాలి. ఈ రసాన్ని 2 ml మోతాదులో ఉదయాన్నే పరగడుపున, రాత్రి పడుకునే ముందు త్రాగితే బీపీ, హైపర్‌టెన్షన్ తగ్గుతాయి.ఇలా బిళ్ళ గన్నేరు ఆకుల రసాన్ని తీసుకోవటం వలన ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. నిద్ర చక్కగా పడుతుంది. మానసిక సమస్యలు తొలగిపోతాయి.
బిళ్ల గన్నేరు మొక్కల ఆకుల రసంతోపాటు వేర్లను ఎండబెట్టి తయారు చేసుకున్న పొడితో డికాషన్ కాచి రోజూ తాగుతుంటే క్యాన్సర్ తగ్గుతుంది. ఎలాంటి క్యాన్సర్‌ను అయినా తగ్గించ గలిగే లక్షణాలు బిళ్ళ గన్నేరులో ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. దీంతో క్యాన్సర్లు తగ్గుముఖం పడతాయి.
బిళ్ళ గన్నేరు ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిలో వేపాకుల పొడి,పసుపు,నీళ్లు వేసి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని మొటిమలు ఉన్న ప్రాంతంలో రాసి ఆరాక సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే మొటిమలు మరియు మొటిమల కారణంగా వచ్చే మచ్చలు అన్ని తొలగిపోయి. ముఖం అందంగా ప్రకాశవంతంగా మారుతుంది. .
పురుగులు,కీటకాలు కుట్టినప్పుడు దద్దుర్లు వస్తాయి. అలాగే విపరీతమైన దురద కూడా వస్తుంది. అలాంటి సమయంలో కీటకాలు కుట్టిన ప్రదేశంలో బిళ్ళ గన్నేరు ఆకుల రసాన్ని రాస్తే నొప్పి, మంట, వాపు నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది. బిళ్ల గన్నేరు మొక్క పువ్వుల మొగ్గలు, దానిమ్మ పువ్వు మొగ్గలను సేకరించి వాటి నుంచి రసం తీయాలి.
ఆ రసాలను కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముక్కులో వేస్తే రక్త స్రావం ఆగుతుంది. నోట్లో వేస్తే నోటి నుంచి వచ్చే రక్త స్రావం ఆగుతుంది. ఇలా చేయడం వల్ల నోటిలో ఉండే పుండ్లు కూడా తగ్గిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.