Rajamouli వైఫ్ మొదట్లో ఏం చేసేవారో తెలుసా?
Rajamouli Wife Rama Rajamouli Details : సినిమాలో నటించే నటులు..అలాగే దర్శకుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన సినిమాలన్నీ హిట్టే. ఏ హీరోతో తీసినా ఆ సినిమా బ్లాక్ బస్టరే. అయితే అతడి విజయం వెనుక తండ్రి విజయేంద్ర ప్రసాద్, బాబాయ్ కీరవాణి లతో పాటు వైఫ్ రమా రాజమౌళి హస్తం కూడా ఉంది.
ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరిస్తూ సినిమాకు కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే అంతకుముందు ఈమె ఏమి చేసేవారనే విషయంలోకి వెళ్తే, ఓ సీరియల్లో నటించిందట. అవును నిజమే. అది కూడా రాజమౌళి ఫ్యామిలీ నుంచి వచ్చిన సీరియల్ కావడం విశేషం. గుణ్ణం గంగరాజు ఈ సీరియల్ తెరకెక్కించాడు. అందులో రాజమౌళి అన్నయ్య కూడా నటించాడు.
అలాగే రాజమౌళి కుటుంబ సభ్యులు మరికొందరు కూడా ఈ సీరియల్ కోసం పని చేసారు.నిజానికి పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజుల్లోనే రమా రాజమౌళి సీరియల్లో నటించినప్పటికీ అప్పుడు మీడియా ప్రచారం ఎక్కువగా లేనందున హైలైట్ కాలేదు. రమా రాజమౌళి నటించిన సీరియల్ పేరు అమృతం. అందులో న్యూస్ రీడర్గా దర్శనమిచ్చింది.
ఎలాంటి తడబాటు లేకుండా చాలా నేచురల్ గానే రమా నటించింది. ఇక అప్పుడప్పుడూ యూ ట్యూబ్లో ఆ వీడియో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ వీడియో కళ్ళబడితే,జక్కన్న వైఫ్ నటించిందా.. ఆమెలో నటి కూడా ఉందా అని ఆశ్చర్యపోవడం వీక్షకుల వంతు అవుతోంది.