MoviesTollywood news in telugu

Ram Charan గోవిందుడు అందరివాడేలే సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో…?

Ram Charan Govndudu andarivaadele movie : రామ్ చరణ్, కృష్ణ వంశీ కాంబినేషన్ లో వచ్చిన Govndudu andarivaadele movie ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంది. నిన్నే పెళ్లాడతా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తయారుచేసిన మరొ కథను నాగార్జున రిజెక్ట్ చేసాడట. కేవలం నాగార్జున ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కథ సెకండాఫ్ నచ్చకపోవడంతో నాగ్ సున్నితంగా తిరస్కరించాడు.

అదే సమయంలో అక్కినేని ఫ్యామిలీ అంతా కల్సి మనం సినిమా చేసారు. అది సూపర్ హిట్ అయింది. విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేసాడు. అయితే నాగ్ రిజెక్ట్ చేసిన కృష్ణవంశీ మూవీ ఏంటంటే గోవిందుడు అందరివాడేలే. నాగ్ రిజెక్ట్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయాల్సి వచ్చింది. కాజల్, కమిలిని ముఖర్జీ హీరోయిన్స్ గా చేసారు.

ఇక ఈ మూవీలో శ్రీకాంత్ చేసిన పాత్రకు వెంకటేష్ ని అనుకున్నా అదీ కుదరలేదు. అలాగే రామ్ చరణ్ తాతయ్య వేషానికి ఓ తమిళనటుడిని సెలక్ట్ చేయగా, చిరంజీవి సూచన మేరకు ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేశారట. 41కోట్లకు పైగా వెచ్చించి తీసిన ఈ మూవీ తొలివారామే 35షేర్ తేవడం విశేషం. మొత్తానికి ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.