బ్రేక్ ఫాస్ట్ గా 1 కప్పు తింటే మెదడు చురుగ్గా పనిచేసి మతిమరుపు సమస్యలు ఉండవు
Brown Rice Health Benefits In Telugu :మనం తీసుకొనే ఆహారం మీద మన ఆరోగ్యం ఆదారపడి ఉంటుంది.ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. వచ్చిన సమస్యలు తగ్గాలన్నా, సమస్యలు రాకుండా ఉండాలన్నా మనం తీసుకొనే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఏ సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ మధ్య కాలంలో బ్రౌన్ రైస్ వాడకం ఎక్కువ అయింది.
ఆ బ్రౌన్ రైస్ తో ఈ విధంగా చేసుకొని తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఒక కప్పు బ్రౌన్ రైస్ ని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకొని రఫ్ గా మిక్సీ చేయాలి. ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి మిక్సీ చేసిన బ్రౌన్ రైస్ రవ్వను వేసి మూడు నిమిషాల పాటు వేగించాలి. ఆ తర్వాత 5 కప్పుల పాలను పోయాలి. ఆ తర్వాత చిన్న పటిక బెల్లం ముక్కను వేయాలి.
ఈ మిశ్రమాన్ని పాన్ లో పెట్టి మూడు విజిల్స్ వచ్చాక సిమ్ లో 5 నిమిషాలు ఉంచి పొయ్యి ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో రెండు కప్పుల పాలను పోసి బాగా కలపాలి. రెండు స్పూన్ల నానబెట్టిన సబ్జా గింజలను వేసి కలపాలి. అరస్పూన్ యాలకుల పొడి,బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు,పిస్తా ముక్కలు,కిస్ మిస్ వేసి కలపాలి.
ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒక కప్పు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. రోజంతా అలసట,నీరసం లేకుండా హుషారుగా ఉంటారు. మెదడు చురుగ్గా పనిచేసి మతిమరుపు సమస్యలు ఏమి ఉండవు. అంతేకాకుండా కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు వంటివి ఏమి లేకుండా ఎముకలు బలగ ఆరోగ్యంగా ఉంటాయి.
చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్తప్రసరణ బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే జీర్ణ సంబండ సమస్యలు ఏ లేకుండా చేస్తుంది. డిప్రెషన్,ఒత్తిడి వంటి వాటిని తగ్గిస్తుంది. కాబట్టి వారంలో మూడు సార్లు తినటానికి ప్రయత్నం చేయండి. మనం తీసుకొనే ఆహారం మన ఆరోగ్యం విషయంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.