సినిమా ఇండస్ట్రీలో తల్లి కూతుర్లు…ఎంత మంది ఉన్నారో..?
Tollywood Top Heroines And Mothers :సినిమా హీరో, హీరోయిన్ ల గుఇర్న్చి ఏ విషయం అయినా తెలుసుకోవటానికి అభిమానులు చాలా ఆసక్తిగా ఉంటారు. స్టార్ హీరోలు,దర్శకులు,ప్రొడ్యూసర్స్,క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా సినిమా పరిశ్రమలో చాలామంది వారసులు ఉన్నట్లే తల్లి నటి అయితే కూతురు కూడా నటిగానే రాణిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు.
అందులో ప్రధానంగా ఒకప్పటి హీరోయిన్ లక్ష్మి. శోభన్ బాబు వంటి హీరోల సరసన హీరోయిన్ గా రాణించి ఎన్నో హిట్స్ అందుకున్న ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అత్తా, అమ్మా పాత్రలతో రాణించి, ఇప్పుడు బామ్మ పాత్రలతో సైతం మెప్పిస్తూ ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది. ఇక మిధునం మూవీలో బాల సుబ్రహ్మణ్యంతో కల్సి నటించి మంచి మార్కులు కొట్టేసింది.
ఈమధ్య వచ్చిన ఓ బేబీ లాంటి సినిమాల్లో ఆమె నటన హైలెట్. లక్ష్మి కూతురు ఐశ్వర్య కూడా అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి,కల్యాణ వైభోగమే,నాని వంటి సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాది సూపర్ స్టార్ కమల్ హాసన్ కూతుళ్లు శృతిహాసన్, అక్షర హాసన్ లు హీరోయిన్ లు గా రాణిస్తున్నారు. అయితే వీరి తల్లి సారిక కూడా ఒకప్పుడు మంచి నటిగా హిందీ మూవీస్ తో రాణించింది.
తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి శృతి హిట్స్ అందుకుంటోంది. మహానటి మూవీతో ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ మంచి పాత్రలతో రాణిస్తోంది. ఈమె తల్లి మేనక సురేష్ కుమార్ మలయాళ,తమిళం,తెలుగు,హిందీ, కన్నడ మూవీస్ లో నటించింది. టాలీవుడ్ లో పున్నమినాగు,ఇంద్రధనస్సు వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ కూతురు సారా అలీఖాన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. అయితే ఈమె తల్లి అమృతా సింగ్ కూడా హీరోయిన్ గా చాలా మూవీస్ లో చేసింది. బాలీవుడ్ హీరోయిన్స్ కాజోల్, తానీషా ల తల్లి తనూజ ఎన్నో హిందీ సినిమాలలో చేయడమే కాదు, సీరియల్స్ లో కూడా చేసింది. ఇక బెంగాలీ నటి అపర్ణా సేన్ నటిగా, స్క్రిప్ట్ రైటర్ గా, దర్శకురాలిగా రాణించి, పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఆమె కూతురు కొంకణ్ సేన్ శర్మ నటిగా రాణిస్తోంది.
డింపుల్ కపాడియా ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇప్పుడు సహాయ పాత్రలు చేస్తోంది. ఈమె కూతురు ట్వింకిల్ ఖన్నా కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఈమె తండ్రి రాజేష్ ఖన్నా కూడా ఒకప్పుడు స్టార్ హీరో. మీనా బాలనటిగా ఎంట్రీ ఇచ్చి, హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి, ఇప్పుడు సెంకండ్ ఇన్నింగ్స్ లో కూడా సత్తా చాటుతోంది. అంతేకాదు ఆమె కూతురు నైనికా చైల్డ్ ఆర్టిస్టుగా తమిళ మూవీ తో ఎంట్రీ ఇచ్చింది.
ఎన్నో సినిమాల్లో నటించిన జయలక్ష్మి తన కూతురు శ్వేతని జయం మూవీతో హీరోయిన్ సదా చెల్లెలిగా ఎంట్రీ ఇప్పించింది. ఆతర్వాత ప్రేమలేఖ మూవీతో హీరోయిన్ అయింది. ఎన్నో మూవీస్ లో సీరియల్స్ లో నటించిన పద్మ తన కూతురిని కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించింది. హ్యాపీ డేస్ మూవీలో అప్పు పాత్ర చేసి, ఆతర్వాత గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో చేసింది. అన్నట్టు హ్యాపీ డేస్ లో నిఖిల్ తల్లిగా పద్మ చేసింది.