నల్ల నువ్వులు, మెంతులు కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
Black sesame seeds And Fenugreek seeds Benefits : మెంతులు,నల్ల నువ్వులలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. రాత్రి సమయంలో అరస్పూన్ మెంతులు, అరస్పూన్ నల్ల నువ్వులను నీటిని పోసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన గింజలను తింటూ ఆ నీటిని తాగాలి.
ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే ఎన్నో సమస్యలు తగ్గుతాయి. కాలేయంలో కొవ్వులను తొలగించటానికి సహాయపడటమే కాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీర్ణ సంబంద సమస్యలు కడుపు ఉబ్బరం,మలబద్దకం,గ్యాస్ వంటి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఇవి డయాబెటిస్ నియంత్రణలో కూడా బాగా సహాయపడతాయి.
ప్యాంక్రియస్ లో బీటా కణాల యాక్టివిటీని పెంచటంలో సహాయపడతాయి. చర్మం,జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి వీటిలో ఉండే పోషకాలు సహాయపడతాయి. అధిక బరువు,శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
మెంతులు మరియు నల్ల నువ్వులను కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు వంటివి అన్నీ తగ్గిపోతాయి. ఈ నొప్పులు ఉన్నప్పుడూ చాలా బాధకారంగా ఉంటాయి. నొప్పుల నుండి మంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.