Healthhealth tips in teluguKitchen

రాత్రి సమయంలో సాక్స్ లు వేసుకొని నిద్రపోతే…ఏమి జరుగుతుందో తెలుసా… ?

Health benefits of sleeping with the socks :సాధారణంగా మనలో చాలా మంది బయటికి వెళ్లే సమయంలో కాళ్లకు సాక్స్ వేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా చలికాలంలో చలిని తట్టుకోవడానికి కాళ్లు పగుళ్లు ఏర్పడినప్పుడు కొంతమంది ఇంటిలో కూడా సాక్స్ వేసుకుంటూ ఉంటారు.
socks
అయితే రాత్రి సమయంలో కాళ్ళకు సాక్స్ వేసుకుని పడుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి స‌మ‌యంలో సాక్సులు వేసుకుని నిద్రించ‌డం వ‌ల్ల పాదాల్లో బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగుప‌డుతుంది. ఇలా సాక్స్ వేసుకోవటం వలన కాళ్ల‌లో ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్ల‌ పాదాల వాపు, కాళ్ల తిమ్మిర్లు, కాళ్ల నొప్పి వంటి స‌మ‌స్య‌లు తగ్గుతాయి.

పాదాల ఆవిర్లు అనే సమస్య ముఖ్యంగా మెనోపాజ్ స‌మ‌యంలో వస్తుంది. ఈ సమస్య కారణంగా నిద్ర సరిగా పట్టదు. అప్పుడు కాట‌న్ సాక్సులు వేసుకుని నిద్ర‌పోతే పాదాలు శరీర ఉష్ణోగ్రతలని క్రమబద్దీకరించి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. ఇక మ‌రో విష‌యం ఏంటంటే.ఎప్పుడూ టైట్‌గా ఉంటే సాక్సులు వేసుకోరాదు.మృదువైన, శుభ్రమైన, నాణ్య‌మైన సాక్సులనే ధ‌రించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.