డయాబెటిస్ ఉన్నవారికి ఈ పిండి దివ్య ఔషధం…షుగర్ లెవెల్స్ ను తగ్గించి పెరగకుండా చేస్తుంది
Ragi Good for Diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలు కూడా రావు.
డయాబెటిస్ ఉన్నవారు ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు. రాగిలో కార్బోహైడ్రేట్ సమృద్దిగా ఉంటుంది. బియ్యం, మొక్కజొన్న లేదా గోధుమలతో పోలిస్తే రాగులలో పాలీఫెనాల్స్, కాల్షియం మరియు ముఖ్యమైన అమైనో ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారిని తెల్ల బియ్యం మరియు గోధుమలకు బదులుగా రాగులను తినమని నిపుణులు చెప్పుతారు.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు స్పీడ్ గా పెరుగుతూ ఉంటాయి. వీటిని తింటే వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ వేగాన్ని పెంచటమే కాకుండా తినాలనే కోరికను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో వచ్చే నీరసం లేకుండా చేస్తుంది. రాగులను పిండిగా చేసుకొని జావగా తయారుచేసి తాగవచ్చు. లేదా రొట్టెలను చేసుకొని తినవచ్చు.
ప్రతి రోజు ఒక స్పూన్ రాగులను తీసుకుంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. రాగి పిండిని మార్కెట్ లో కొనుగోలు చేయటం కన్నా మనం రాగులను తెచ్చుకొని పిండిగా చేసుకోవటం మంచిది. రాగులలో ఉండే పోషకాలు జీర్ణక్రియ సమయంలో ఉత్పన్నమయ్యే గ్లూకోజ్‌ని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టేలా చేస్తాయి.
అందుకే రాగులతో తయారుచేసిన ఆహారం తీసుకుంటే భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రాగులలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్దిగా ఉన్నాయి. రాగులలో లభించే మెగ్నీషియం క్రమంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది మరియు డయాబెటిస్‌లో కనిపించే ఇన్సులిన్ నిరోధకతను ఎదుర్కొంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.