1 సారి తాగితే దగ్గు,జలుబు,గొంతు నొప్పి,గొంతులో గురక,ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయి
Cold And Cough Home Remedies : గొంతుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి వచ్చాయంటే చాలా తొందరగా తగ్గవు. కొంతమందికి ఆస్తమా., ఆయాసం, ఉబ్బసం వంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి.
ఈ సమస్యలు ఉన్న వారు ఇప్పుడు .చెప్పే డ్రింక్ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి ఐదు లవంగాలు., ఆరు మిరియాలు, పది తులసి ఆకులు, అంగుళం అల్లంను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీరు బాగా మరిగాక నీటిని .గ్లాసులోకి వడకట్టాలి.
ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. అవసరం అనుకుంటే తేనె కూడా కలుపుకోవచ్చు డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఉదయం సమయంలో తాగితే దగ్గు., జలుబు, గొంతు నొప్పి, గొంతులో గురక వంటి అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు రోజులో రెండు సార్లు తాగవచ్చు.
ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవటమే కాకుండా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అల్లం,లవంగాలు,మిరియాలు,తులసి ఆకులలో ఉన్న లక్షణాలు దగ్గు వంటి శ్వాస సమస్యల నుండి ఉపశమనం కలిగేలా చేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.