Healthhealth tips in teluguKitchen

అర గ్లాసు తీసుకుంటే కీళ్ల మధ్య టక్ టక్ శబ్ధం తగ్గి కీళ్ల మధ్య గుజ్జు పెరిగి నొప్పులు తగ్గుతాయి

Knee Pain Home Remedies In telugu : ఎముకల మధ్య గుజ్జు,కీళ్ల మధ్య అరిగి శబ్ధం రావటం,కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉండటం వలన నడవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నప్పుడూ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పులను తగ్గించటానికి ఎముకల మధ్య గుజ్జు పెరగటానికి చాలా మంచి చిట్కా ఉంది.

రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ కలోంజీ గింజలను వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానిన కలోంజీ గింజలు, నీటిని కలిపి పొయ్యి మీద పెట్టి 5 నిమిషాలు మరిగించాలి.ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం మరిగించాలి. బాగా మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి తాగాలి.
jaggery Health benefits in telugu
ఈ నీటిని తాగటం వలన కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గటమే కాకుండా కీళ్ల మధ్య గుజ్జు పెరిగి టక్ టక్ అనే శబ్ధం కూడా తగ్గుతుంది. అలాగే నరాల బలహీనత ఉన్నవారికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శరీరంలో రోగనిరోదక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది.
Joint Pains
ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. 15 రోజులు ఈ డ్రింక్ తాగితే ఆ తేడా మీకే తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఎన్ని రోజులు తాగాలి అనే విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. కండరాలు బలంగా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.