MoviesTollywood news in telugu

ఛాలెంజ్ సినిమా వెనక ఉన్న నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…!?

Chiranjeevi challenge full movie In telugu :చిరంజీవికి సంబందించిన ప్రతి విషయాన్నీ తెలుసుకోవటానికి అభిమానులు ఎప్పుడు సిద్దంగా ఉంటారు. అప్పట్లో యండమూరి వీరేంద్రనాధ్ నవల ఆధారంగా చిరంజీవి, విజయశాంతి, సుహాసినిలతో ఏ కోదండరామిరెడ్డి తీసిన ఛాలెంజ్ మూవీ సూపర్ హిట్. చిరంజీవిని యూత్ ఐ కాన్ చూపించిన సినిమా ఇది. ఇప్పటికీ ఈ సినిమా స్ఫూర్తి. అందుకే అల్లు అర్జున్ జులాయి మూవీకి ఛాలెంజ్ సీన్ ని టివిలో చూపిస్తూ రిఫరెన్స్ గా వాడారు.

మాస్ సినిమాలకు సరైన అర్ధం చెప్పిన కోదండరామిరెడ్డి అగ్ర హీరోలందిరికీ హిట్స్ అందించారు. ఐదేళ్లలో 50లక్షలు సంపాదించడం ఎలా అనే అంశంతో రూపుదిద్దు కున్న సినిమా. 10పైసల పెట్టుబడి. 5ఏళ్ళ సమయం. చట్టబద్ధంగా 50లక్షల టార్గెట్. ఓ కోటీశ్వరునితో నిరుద్యోగి చేసే ఛాలెంజ్ ఇది.

కానీ గాంధీ పాత్ర వేసిన చిరు ఈ సినిమాలో ఛాలెంజ్ ని స్వీకరించి విజయం సాధిస్తాడు. ఓ బిచ్చగత్తె ఇచ్చిన 10పైసలే అతడిని 50లక్షల సంపాదనకు మార్గం చూపింది. చిరంజీవి, కోదండరామిరెడ్డి, కె ఎస్ రామారావు, యండమూరి వీరేంద్రనాధ్, సత్యమూర్తి ఈ ఐదుగురి కాంబినేషన్ లో వచ్చిన అభిలాష సూపర్ హిట్ అయింది. అప్పుడే ఇంకో సినిమా అనుకున్నారు.

అప్పటికే డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు పేరిట ఓ సీరియల్ కూడా జ్యోతి మాసపత్రికలో రాసారు. సీరియల్ చదివాక కె ఎస్ రామారావు వెంటనే సినిమా ప్రయత్నాలు స్టార్ట్ చేసారు. సాయినాధ్ స్క్రీన్ ప్లే రాసారు. ఈ అంశాన్ని తెరమీద ఆవిష్కరించడం కొంచెం కష్టమే.

ఇక ఈ మూవీ కి టైటిల్ సూచించమని జ్యోతి మాసపత్రికలో పాఠకులకు పోటీ నిర్వహించి, అందులోంచి ఛాలెంజ్ టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఇళయరాజా మ్యూజిక్. 45రోజుల్లో షూటింగ్ పూర్తికావడంతో 1984ఆగష్టు 9న రిలీజ్. డబ్బు లేకపోతె పనిలేదని రావుగోపాలరావు వాదన. కృషిచేస్తే ఫలితం వస్తుందని చిరంజీవి వాదన. దీక్షతో పనిచేస్తే యువతరం సాధించలేనిది లేదని ఛాలెంజ్ చేసిన కథ ఇది.

అందుకే థియేటర్లలో విజిల్స్ వేయించింది. లవ్ , రొమాన్స్, యాక్షన్, సెంటిమెంట్, సస్పెన్స్, ఎమోషన్ , ఇలా అన్నీ రంగరించిన సినిమా ఇది. అల్లు అరవింద్ కూడా అతిధి పాత్ర వేసాడు. ఇళయరాజా స్వరాలూ కూర్చిన సాంగ్స్ సూపర్. కోదండరామిరెడ్డి టేకింగ్ ఈ మూవీని చిరస్థాయిగా నిలిపింది.ఈ క్లాసిక్ మూవీ చివరలో నో ఎండ్ అనే కార్డు పడడం సమయోచితంగా ఉంది.