ఈ ఫోటోలో ఉన్న చిన్నారి హీరో.. టాలీవుడ్ లవర్ బాయ్..ఎవరో గుర్తు పట్టారా…?
Tollywood hero Tarun : బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో చేసి, నువ్వే కావాలి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, బ్లాక్ బస్టర్ అందుకుని,టాలీవుడ్ లవర్ బాయ్ గా గుర్తింపు పొందిన హీరో తరుణ్ ఎన్నో హిట్ మూవీస్ చేసాడు. ఇతడి అసలు పేరు బట్టి తరుణ్ కుమార్. తరుణ్,లవర్ బాయ్ తరుణ్ అని నిక్ నేమ్స్ ఉన్నాయి. 1983 జనవరి 8న చక్రపాణి, రోజా రమణి దంపతులకు హైదరాబాద్ లో తరుణ్ జన్మించాడు.
బాలనటుడిగా మనసుమమత మూవీతో టాలీవుడ్ లో తరుణ్ ఎంట్రీ ఇచ్చాడు. సూర్య ఐపీఎస్,ఆదిత్య 369, తేజ వంటి మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్టుగా తన సత్తా చాటాడు. స్టడీస్ కారణంగా సినిమాలకు దూరమై, కె విజయభాస్కర్ డైరెక్షన్ లో 2000లో వచ్చిన నువ్వే కావాలి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బిజినెస్ చూసుకుంటున్నారు తరుణ్. సినిమాలకు దూరమయిన.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్స్ పోస్ట్స్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటారు. తరుణ్ చివరి సారిగా నటించిన సినిమా ఇది నా లవ్ స్టోరీ. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరుణ్ చిన్నప్పటి ఫోటో వైరల్ గా మారింది.