jai lava kusa సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?
Ntr Jai Lava Kusa Full Movie : జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో కొన్ని హిట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ప్లాప్స్ కూడా ఉన్నాయి. చాలా వరకు విజయవంతం అయ్యాయి. Ntr తన కెరీర్ లో కొన్ని సినిమాలను వదులుకున్నాడు. అలాగే వేరొక హీరో చేయవలసిన సినిమాలను Ntr చేసాడు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జై లవకుశ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిన విషయమే. జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో బాగా నటించి అభిమానులను మెప్పించాడు. జైలవకుశ సినిమాకి దర్శకత్వం వహించిన బాబి మొదటగా ఈ కథను మాస్ మహారాజ్ రవితేజకి వినిపించాడు.
రవితేజ కథ విన్నాక కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడు. ఆ మార్పులకు బాబి అంగీకరించలేదు దాంతో ఆ కథను జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించాడు. కథ వినిపించడం ఆలస్యం జూనియర్ ఎన్టీఆర్ ఓకే చెప్పేసాడు దాంతో సినిమా పట్టాలెక్కింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపాడు.