Mahesh సోదరి మంజుల పెళ్లి ఎలా జరిగిందో తెలిస్తే..
Mahesh Babu Sister Manjula :మహేష్ బాబు సోదరి మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె నటిగా దర్శకురాలిగా నిర్మాతగా బాగా రాణిస్తోంది. మంజుల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి గురించి కొన్ని విషయాలు చెప్పు వచ్చింది. మంజుల సంజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు అట.
పెద్దల అంగీకారంతో తిరుపతిలో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. మొదట్లో తండ్రి కృష్ణ అంగీకరించలేదు. ఆ తర్వాత అంగీకరించారట. తల్లి మాత్రం తన ప్రేమ పెళ్లికి బాగా సపోర్ట్ చేసిందట. ప్రస్తుతం నేను సంజయ్ చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పింది మంజుల.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించినటువంటి “మనసుకు నచ్చింది” అనే చిత్రానికి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించింది.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.
అయితే నిర్మాతగా వ్యవహరించిన నాని, పోకిరి, ఏం మాయ చేసావే, తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.