పైల్స్ సమస్యతో బాధపడేవారు ఇలా చేస్తే చాలు…శాశ్వతంగా మాయం అవుతాయి
Piles Home Remedies in Telugu : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది Piles సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి అనేక కారణాలతో చాలా మంది Piles సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పి, రక్తస్రావం, మలద్వారం చుట్టూ వాచిపోవడం వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి.
ఈ సమస్యలకు చెక్ పెట్టటానికి Spring Onions చాలా బాగా సహాయపడుతుంది. ఉల్లి కాడలలో డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన పైల్స్ సమస్యతో బాధపడేవారు తమ డైట్ లో Spring Onions ను బాగంగా చేసుకుంటే మంచిదని నిపుణులు చెప్పుతున్నారు. ఉల్లి కాడల్లో ఉన్న డైటరీ ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచుతుంది.
Piles తో బాధపడేవారు ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా పెరుగు వేసుకుని అందులో ఉల్లికాడ ముక్కలను, కొంచెం ఉప్పు కలిపి.. రోజుకి రెండుసార్లు తింటే పైల్స్ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఫైల్స్ వల్ల వచ్చే వాపు, నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇలా తీసుకోవటం వలన పైల్స్ సమస్య తగ్గటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఉల్లికాడ లో సల్ఫర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఉల్లి కాడలతో తయారు చేసిన సూప్ తాగితే దగ్గు, జలుబు నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గించుకోవటానికి కూడా ఉల్లి కాడలు చాలా బాగా సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.