150 కి పైగా రోగాలను నయం చేసే ఈ ఆకు గురించి మీకు తెలుసా…అసలు వదలద్దు
Ranapala leaves health Benefits In telugu: మన పరిసరాలలో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా మనకు తెలియక వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తాము. అటువంటి మొక్కలలో రణపాల ఒకటి. రణపాల మొక్కను ఆఫీసుల వద్ద, ఇంటి పరిసరాలలో అలంకరణ మొక్కగా పెంచుతూ ఉంటారు.
రణపాల మొక్క ఆకులు వేర్లు కాండం ఇవన్నీ మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడి దాదాపు 150కి పైగా వ్యాదులను తగ్గించే శక్తి ఉంది. రణపాల ఆకు కాస్త దళసరిగా ఉండి రుచిలో పులుపు, వగరుతో కలిసి ఉంటుంది. రణపాయ ఆకులు కిడ్నీల సమస్యలు, కిడ్నీలో రాళ్ళు ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తాయి.
ఈ రణపాల ఆకు ఉదయం రెండు రాత్రి రెండు ఆకులు తింటే కిడ్నీలో,బ్లాడర్ లో ఎర్పడ్డ రాళ్ళను బయటకు పంపుతుంది. రక్తంలోని క్రియాటిన్ లెవల్స్ తగ్గుతాయి. ఇది డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరు మెరుగు పడుతుంది. మూత్రాశయాన్ని శుభ్రం చేయడంతో పాటు ప్రేగుల నుండి హానికరమైన వ్యర్థాలను బయటకు పంపటానికి సహాయపడుతుంది.
అంతేకాకుండా శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచి డయబెటిస్ అదుపులో ఉండేలా చేస్తుంది. రణపాల ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి నుదురు మీద రాస్తే తలనొప్పి తగ్గుతుంది. రణపాల ఆకుల రసం ఒక్క చుక్కను చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్దకం సమస్యలను తగ్గిస్తుంది. ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ లక్షణాలు ఉండుట వలన మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వారికీ మంచి మేలు చేస్తుంది. కాబట్టి ఈ మొక్క కనిపిస్తే ఇంటికి తెచ్చుకోండి. ఈ మొక్క చాలా సులభంగా పెంచుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/