ఇంజనీరింగ్ చదివిన నటులు ఎంతమంది ఉన్నారో తెలుసా?
Tollywood Stars Education :చాలామంది సినిమాల్లోకి చదువు లేక వచ్చారని మనం అనుకుంటూ ఉంటాం కానీ కొంతమంది నటులు బాగా చదివి సినిమాల్లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు ఈ రోజు ఇంజనీరింగ్ చదివి సినిమాల్లోకి వచ్చిన హీరో హీరోయిన్స్ ఎంత మంది ఉన్నారో చూద్దాం.
అక్కినేని నాగార్జున చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసి సినిమాల్లోకి వచ్చాడు. ప్రభాస్ హైదరాబాదులో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. నిఖిల్ కూడా హైదరాబాదులోని ఇంజనీరింగ్ పూర్తి చేశాడు
అడవి శేషు అమెరికాలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నెల్లూరులో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.నభా నటేష్ బెంగూళూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది
కలర్స్ ప్రోగ్రాం ద్వారా మంచి పేరు సంపాదించిన స్వాతి రెడ్డి ఇంజనీరింగ్ హైదరాబాదులో పూర్తి చేసింది. పెళ్లి చూపులు చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన రీతువర్మ ఇంజనీరింగ్ హైదరాబాదులో పూర్తి చేసింది