రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా…అసలు నమ్మలేరు
Walking Benefits in telugu: మనం ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో రకాల పనులను చేసుకుంటాం. ఆ పనుల ఒత్తిడి కారణంగా వ్యాయామం మీద దృష్టి పెట్టలేం. అయితే ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామం చేయటానికి కేటాయించడం చాలా అవసరం. మారిన జీవనశైలి కారణంగా కచ్చితంగా ప్రతిరోజు వ్యాయామం అనేది చేయాలి.
అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం లేదా కూర్చుని అలా ఉండటం వలన శరీరంలో అధిక కొవ్వు పెరిగి బరువు పెరుగుతారు. రాత్రి భోజనం చేసిన తర్వాత పది నిమిషాలు వాకింగ్ చేస్తే జీర్ణశక్తిని పెంచి గ్యాస్ కడుపుబ్బరం మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.
రాత్రి సమయంలో నడవడం వలన జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడే గ్యాస్ట్రిక్ ఎంజైములను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. దాంతో గ్యాస్, కడుపుబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చూస్తుంది.
అలాగే శరీరం నుండి విషాలను బయటకు పంపుతుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. తినాలని కోరికను తగ్గిస్తుంది. దాంతో ఆహారం తక్కువ మోతాదులో తీసుకుంటూ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో ఒత్తిడి కారణంగా మనలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారు.
అటువంటివారు రాత్రి భోజనం చేసిన తర్వాత నడిస్తే ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే శారీరక వ్యాయామం చేసినప్పుడు శరీరం రక్తంలోని కొంత గ్లూకోజ్ ను వినియోగించుకుంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు కూడా రాత్రి భోజనం అయ్యాక పది నిమిషాలు నడిస్తే చాలా మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.