బంగారం కంటే విలువైన ఈ మొక్క మీ ఇంటిలో ఉందా…అసలు మిస్ కాకుండా చూడండి
Nuruvarahalu Benefits in telugu: మన ఇంటిలో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటిలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే వాటి గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు చెప్పే ఈ మొక్క దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఈ మొక్క ను కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఈ పువ్వులను అలంకరణ కోసం దేవుని పూజకు ఉపయోగిస్తుంటాం.
ఈ మొక్క వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కానీ మనలో చాలామందికి ఈ విషయాలు తెలియవు. ఈ విషయాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంతకీ ఈ మొక్క పేరు ఏమిటో తెలుసా నూరు వరహాల మొక్క. ఇది రూబియాసి కుటుంబంలో పుష్పించే మొక్క.
ఇది పింక్, ఎరుపు, లేత గులాబీ, తెలుపు మొదలైన వివిధ రంగులలో అందమైన పుష్పాలను కలిగి ఉంది. మీరు కొబ్బరి నూనెలో నూరు వరహాల పువ్వులను వేసి మరిగించి ఆ నూనెను వడకట్టి ఈ నూనెను పూయడం ద్వారా తామర మరియు గజ్జి వంటి చర్మ వ్యాధులను చికిత్స చేయవచ్చు. ఈ నూనె చుండ్రు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.
ఈ పువ్వుల పేస్ట్ లో బియ్యం పిండి వేసి కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లనినీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం మీద మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే ఈ పువ్వుల పేస్ట్ ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక శుభ్రం చేసుకుంటే మొటిమలు మరియు మొటిమలు కారణంగా వచ్చే నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి.
నూరు వరహాల పువ్వులతో టీ తయారుచేసుకొని తాగితే తలనొప్పి,ఒత్తిడి,గొంతు నొప్పి వంటివి తగ్గిపోతాయి. ఆ టీ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ నీటిలో కొన్ని పువ్వులను వేసి బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి ఆ నీటిలో నిమ్మరసం,తేనె కలుపుకొని తాగాలి. డయబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.