Venkatesh తెలుగు తెరకు పరిచయం చేసిన ఈ టాప్ హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా?
Tollywood Hero venkatesh:దగ్గుపాటి వెంకటేష్ కన్నా విక్టరీ వెంకటేష్ గానే మనందరికీ బాగా పరిచయం. తన సినిమాల్లో మంచి కామెడీ టైమింగ్ తో నవ్విస్తూ, సేంట్ మెంట్ తో ఏడిపిస్తూ, డైలాగ్స్ డెలివరీలో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. వెంకటేష్ దగ్గుపాటి రామానాయుడు గారి రెండొవ కొడుకు అని మనకు తెలిసిన విషయమే. వెంకటేష్ 1986 లో కలియుగ పాండవులు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసాడు. వెంకటేష్ స్వర్ణ కమలం సినిమాలో నటించి ఎన్నో ప్రశంసలను అందుకున్నారు.
అదే సంవత్సరంలో వచ్చిన వారసుడొచ్చాడు సినిమా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కొన్ని పరాజయాలు వచ్చిన బొబ్బిలిరాజాతో హిట్ కొట్టాడు. వెంకటేష్ ఏ పనైనా చాలా పట్టుదలతో చేస్తారు. వెంకటేష్ సమయం వచ్చినప్పుడల్లా తనకు ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయని చెపుతూనే ఉంటాడు.
వెంకటేష్ సినిమాలు కుటుంబ,వినోదభరితంగా ఉంటాయి. వెంకటేష్ సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ పరిచయం అయ్యారు. వారి గురించి వివరంగా తెలుసుకుందాం.
ఖుషూబు వెంకటేష్ హీరోగా వచ్చిన కలియుగ పాండవులు సినిమా ద్వారా పరిచయం అయింది. వెంకటేష్ కూడా ఈ సినిమా ద్వారానే పరిచయం అయ్యాడు. ఈ సినిమా 1986 లో కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. వెంకటేష్ కి కొత్త కథానాయకుడిగా నంది అవార్డ్ ని తెచ్చిపెట్టింది.
గౌతమిశ్రీనివాస కళ్యాణం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది గౌతమి. వెంకటేష్ సరసన నటించిన గౌతమి మొదటిసారిగా ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. శ్రీనివాస కళ్యాణం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది.
దివ్య భారతిఉత్తరాది నుండి దక్షిణాది పరిశ్రమకు వచ్చి మంచి పేరు తెచ్చుకుంది దివ్య భారతి. రామానాయుడు తమ సంస్థ నిర్మించిన బొబ్బిలి రాజా సినిమా ద్వారా దివ్యభారతిని పరిచయం చేసారు. ఈ సినిమా వెంకటేష్,దివ్యభారతి హీరో హీరోయిన్స్ గా బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా ఘన విజయం సాధించి వెంకటేష్ కి మాస్ ఇమేజ్ ని సంపాదించి పెట్టింది .
టబు 1987 లో కూలీ నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ సరసన నటించిన టబు ఈ సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది.
శిల్ప శెట్టి సాహస వీరుడు సాగర కన్య సినిమాతో వెంకేటేష్ తో జోడి కట్టి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1996 లో విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ సినిమాగా నిలిచింది.
ప్రేమ సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ పై రామానాయుడు నిర్మించిన ధర్మ చక్రం సినిమాలో వెంకటేష్ తో నటించిన ప్రేమకు ఇదే తోలి సినిమా. ఈ సినిమా వెంకటేష్ కి నంది అవార్డు,ఫిలిం ఫేర్ అవార్డు లను తెచ్చిపెట్టింది.
అంజలా జవేరి వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అంజలా జవేరి. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.
ప్రీతి జింతా ప్రేమంటే ఇదేరా సినిమాతో రామానాయుడు పరిచయం చేసాడు. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించాడు. 1998 లో వచ్చిన ఈ సినిమా హిట్ అయ్యింది.
ఆర్తి అగర్వాల్. సురేష్ బాబు నిర్మించిన వెంకటేష్ హీరోగా నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయింది. 2001 లో వచ్చిన ఈ సినిమా ఆర్తి అగర్వాల్ కి మంచి పేరు తెచ్చిపెట్టి ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది.
కత్రినా కైఫ్ మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ తో నటించి మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయం అయింది. 2004 లో ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ బేనర్ లో వచ్చింది.