Healthhealth tips in telugu

వృద్దాప్య ఛాయలను తగ్గించి యవ్వనాన్ని పెంచే ఉసిరిలో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో తెలుసా?

Amla Health Benefits In telugu : ఉసిరిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. మన ఆరోగ్య పరిరక్షణలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. ఉసిరిని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. సి విటమిన్ సమృద్ధిగా ఉండే ఉసిరికాయ చలికాలంలో విరివిగా లభిస్తుంది. ఒక్క ఉసిరికాయ రెండు నారింజ పండ్లతో సమానం. కొంచెం వగరు, పులుపు కలయికతో ఉంటుంది.

ఉసిరికాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన విటమిన్ సి లోపంతో బాధపడే వారికి మంచి మందు అని చెప్పవచ్చు. ఉసిరిని రెగ్యులర్ గా తీసుకోవటం వలన రక్తంలో పేరుకుపోయిన కొవ్వులను కరిగించి గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది.
Usirikaya benefits
ఉసిరిలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన ప్రేగు కదలికలను మెరుగు పరచి మలబద్దకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. ఉసిరిని రెగ్యులర్ గా తీసుకోవటం వలన రక్తంలో ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి. అంతేకాక ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. మహిళల్లో మోనోఫాజ్ సమస్యలను తగ్గిస్తుంది.
Diabetes diet in telugu
మధుమేహం సమస్య ఉన్నవారు ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. గ్యాస్ సమస్యతో బాధ పడుతున్నవారు ఒక గ్లాస్ నీటిలో ఒక గ్రామ్ ఉసిరిపొడి,కొంచెం పంచదార కలిపి త్రాగితే గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు,దగ్గు వంటి సాధారణ జబ్బులు రాకుండా కాపాడుతుంది.

శరీర జీవక్రియ రేటును పెంచి, కొవ్వు పదార్థాల వినియోగాన్ని పెంచుతుంది. అందువల్ల బరువు తగ్గాలని అనుకొనే వారికీ మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఈ సీజన్ లో ఉసిరికాయలు చాలా విరివిగా లభ్యం అవుతాయి. ఉసిరికాయలను ముక్కలుగా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి రోజు ఉసిరి తీసుకోని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.