ప్రతి రోజు ఒక స్పూన్ తీసుకుంటే చాలు… కీళ్ల నొప్పులు,డయాబెటిస్,అధిక బరువు సమస్యలు ఉండవు
Joint Pains Home Remedies In Telugu :ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. మన ఇంట్లో ఉండే కొన్ని ఆహార పదార్థాల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు చెప్పే హోమ్ రెమిడి అన్ని రకాలుగా సహాయపడుతుంది. మన వంటింట్లో రెగ్యులర్ గా అల్లం ప్రతి రోజు ఉపయోగిస్తుంటాం. అల్లం చిన్న ముక్క తీసుకుని శుభ్రంగా కడిగి పై తొక్క తీసి తురుముకోవాలి.
అల్లం తురుము ఒక స్పూన్ ఉండేలా చూసుకోవాలి. ఒక బౌల్లో ఒక స్పూన్ అల్లం తురుము ఒక స్పూన్ తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకుంటూ ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.
అధిక బరువు కీళ్ల నొప్పులు డయాబెటిస్ వంటి వాటిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా జీర్ణ సంబంధ సమస్యలైన అజీర్ణం గ్యాస్ కడుపుబ్బరం మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేదెలా చేస్తుంది. తేనె,అల్లం ఈ విధంగా ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆరోగ్యం కోసం కాస్త సమయాన్ని కేటాయించి ఇంటి చిట్కాలను ఫాలో అయితే సమస్య చిన్నగా ఉన్నప్పుడూ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
అదే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడూ డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇంటి చిట్కాలను కూడా ఫాలో అయితే తొందరగా మంచి ప్రయోజనం కనపడుతుంది.