MoviesTollywood news in telugu

BalaKrishna రిజెక్ట్ చేసిన బ్లాక్‌‌‌బస్టర్ సినిమాలు ఇవే..!

Balakrishna rejected Movies : ఫలానా సినిమాకు ఫలానా హీరో బాగుంటాడని అంచనాతో వస్తే, వారు రిజెక్ట్ చేస్తే వేరే వాళ్లతో తీస్తారు. అవి బ్లాక్ బస్టర్ అయితే ముందుగా ఛాన్స్ కాదనుకున్న వాళ్ళు మిస్సయ్యామని బాధ పడతారు. ఇలా ఇండస్ట్రీలో చాలా ఘటనలు ఉన్నాయి. అయితే నందమూరి నటసింహం బాలకృష్ణ విషయంలో కూడా ఇలాంటి ఘటనలు ఉన్నాయట.

వాటి వివరాల్లోకి వెళ్తే, బజారురౌడీ మూవీ ముందుగా బాలకృష్ణ, దర్శకుడు కోదండరామిరెడ్డి కలిసి చేద్దామని అనుకున్నారు కానీ బాలయ్య డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో కృష్ణ తనయుడు రమేష్ బాబుతో తీసి, హిట్ కొట్టారు. చిన్నతంబి అనే తమిళ సినిమాకి రీమేక్ చంటి మూవీని ముందుగా బాలయ్యతో చేయాలని అనుకుంటే, అతడికి కథ నచ్చక రిజెక్ట్ చేశాడు. తర్వాత రాజేంద్రప్రసాద్ తో ఫిక్స్ అయినప్పటికీ చివరికి వెంకటేష్ దగ్గరకు చేరి ఇండస్ట్రీ హిట్ అయింది.

అలాగే సూర్యవంశం మూవీని బాలయ్యతో చేయాలని సినిమా నిర్మాత ఆర్ బి చౌదరీ అనుకున్నప్పటికీ పెద్దన్నయ్యకి స్టోరీ దగ్గరగా ఉందని కాదని చెప్పేయడంతో వెంకటేష్ చేసి హిట్ కొట్టాడు. నరసింహుడు నిర్మాత చెంగల వెంకట్ రావుని డైరెక్టర్ వి సముద్ర సంప్రదించి, బాలయ్యతో సింహరాశి చేయడానికి కసరత్తు చేస్తుంటే, సమరసింహారెడ్డి సక్సెస్ తో తర్వాత ఇలాంటి సినిమా కరెక్ట్ కాదని బాలయ్య నో చెప్పేయడంతో డాక్టర్ రాజశేఖర్ తో తీశారు.

కాగా బాలకృష్ణని దృష్టిలో పెట్టుకొని దర్శకుడు వైవిఎస్ చౌదరీ మొదట సీతయ్య కథని రాసుకున్నాడు. బాలయ్యకి కూడా కథ బాగా నచ్చినప్పటికీ చెన్నకేశవరెడ్డి మూవీతో బిజీ వలన వదిలేసాడు. దాంతో హరికృష్ణ ఈ సినిమాని చేసి హిట్ అందుకున్నాడు. అలాగే విజయేంద్రప్రసాద్, రాజమౌళి మొదట్లో సింహాద్రి కథను కేవలం బాలకృష్ణని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నారు.

కానీ కథ నచ్చకపోవడంతో ఎన్టీఆర్ తో చేసి, బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీని ముందుగా బాలకృష్ణతో చేయాలనుకున్నా, కారణం ఏమిటో గానీ పవన్ కళ్యాణ్ తో చేసి హిట్ కొట్టారు.