Chiranjeevi ‘పసివాడిప్రాణం’ మూవీ ఎన్ని వందల కోట్లు వసూల్ చేసిందో తెలుసా?
Pasivadi pranam Movie:అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలో కొంత అనిశ్చితి నెలకొంది. అప్పుడు అగ్ర హీరోల సైతం కాస్త ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో చిరంజీవిని ఒక రీమేక్ నిలబెట్టింది. పసివాడి ప్రాణం సినిమాతో చిరంజీవి ట్రెండ్ సృష్టించారని చెప్పవచ్చు. ఇప్పుడు బాహుబలి,కబాలి ఎన్నో కోట్లను కొల్లగొట్టాయని చెప్పుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లోనే ఇప్పటి లెక్కల్లో చూస్తే…. చిరు పసివాడి ప్రాణం సినిమాతోనే కోట్లు కొల్లగొట్టాడు.
ఆ వివరాల్లోకి వెళితే…. చిరంజీవి అప్పటికే ఖైదీ,అడవిదొంగ సినిమాలు చేసి చిన్న పిల్లల్లో మంచి క్రేజ్ సంపాదించాడు. తెలుగు సినిమాల్లో ఫైట్స్ కి ఒక శైలిని ఏర్పరచాడు. అలాంటి చిరంజీవి చైల్డ్ సేంట్ మెంట్ సినిమా చేసాడు. ఆ సినిమా అందరి గుండెల్లో నిలిచిపోయింది.సినిమా కథలోకి వస్తే ఒక హత్య…దానికి 8 సంవత్సరాల పిల్లాడు ప్రత్యక్ష సాక్షి. హంతకులకు శిక్ష పడేవరకు ఆ పిల్లవాడిని కాపాడే ఒక పోలీస్ ఆఫీసర్. తెలుగులో రీమేక్ చేయటానికి అల్లు అరవింద్ హక్కులను సంపాదించారు.
చిరు ఇమేజ్ కి తగ్గట్టుగా కథలో ఫిల్ తగ్గకుండా ఉండటానికి కథ ఫినిషింగ్ కోసం జంధ్యాల, దర్శకత్వ భాద్యతను కోదండరామిరెడ్డికి అప్పగించారు. ఈ సినిమా అసలు మాతృక ఇంగ్లిష్ సినిమా అయినప్పటికీ, అప్పటికే తమిళ,మలయాళ భాషల్లో వచ్చిన ఈ సినిమాను చిరుకి తగ్గట్టుగా మార్పులు చేయటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.నాలుగు కోట్లు వసూలు చేసిన చిరు ఖైదీ సినిమా రికార్డ్ ను తిరగరాస్తూ పసివాడి ప్రాణం సినిమా నాలుగున్నర కోట్లను వసూలు చేసింది. దాంతో అప్పటివరకు అనధికార నెంబర్ వన్ హీరోగా ఉన్న చిరును ఈ సినిమాతో మీడియా నెంబర్ వన్ హీరోని చేసేసింది.
రష్యన్ భాషలోకి అనువధింపబడి మొట్టమొదటి సారిగా మాస్కోలో 600 ధియేటర్స్ లో విడుదల అయినా సినిమా పసివాడి ప్రాణం. ఇదే కథను 28 సంవత్సరాల తర్వాత 2015 లో ఈ కాలానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి రచయత విజయేంద్రప్రసాద్ మరో కథను రాస్తే అది సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా ‘బజరంగీ భాయీజాన్’ అయింది. ఈ సినిమా 300 కోట్లను వసూలు చేసింది.ఆ సందర్భంగా రచయత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ పసివాడి ప్రాణం కథ ఫార్ములా ఖరీదు 300 కోట్లు అన్నారు.