పాలలో వీటిని ఉడికించి తింటే అద్భుత ప్రయోజనాలు..ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి
pistachios health benefits in telugu : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్య వస్తోంది. ముఖ్యంగా చాలా చిన్న వయసులోనే ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. వాటిలో డయాబెటిస్ అనేది ఒక ప్రధాన సమస్యగా చెప్పవచ్చు. డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే.
అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. డయాబెటిస్ నియంత్రణలో పిస్తా పప్పు చాలా బాగా సహాయపడుతుంది. మారిన జీవన శైలి కారణంగా ఈ మధ్యకాలంలో మనలో చాలామంది డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటుగా చేసుకున్నారు.
సాధారణంగా డ్రై ఫ్రూట్స్ ని నీటిలో నానబెట్టి తింటూ ఉంటారు. అలా కాకుండా పాలలో ఉడికించి తింటే ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోయాలి. పాలు కాస్త వేడి అయ్యాక ఐదు పిస్తా పప్పులను చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేయాలి.
ఐదు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. ఈ పాలను పిస్తా పప్పును తింటూ తాగాలి. అయితే పిస్తా పప్పు పాలను తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పిస్తా పప్పు పాలు కలిపి తీసుకోవడం వలన మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ అంది కండరాలను బలోపేతం చేస్తుంది.
పాలు, పిస్తా పప్పులో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా కీళ్లు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు ప్రతిరోజు తాగితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఈ మధ్య ఫోన్స్ వాడకం ఎక్కువ అయింది . కాబట్టి మనలో చాలా మంది కంటికి సంబందించిన సమస్యలతో బాధపడుతున్నారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.