ఎక్కడైనా ఈ తీగ కనిపిస్తే అసలు వదలకండి..ఊహించని ప్రయోజనాలు
Health Benefits In tippatiga :తిప్పతీగలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తిప్పతీగ గురించి పల్లెటూర్లలో ఉండే వారికి బాగా తెలుసు. మన చుట్టూ పక్కల తిప్పతీగ కనిపించినా….దాని గురించి తెలియక ఎదో పిచ్చి మొక్కగా భావిస్తాం. తిప్పతీగలో ఆకు,కాండం,వేరు ఇలా అన్ని బాగాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుకోవటానికి ఇప్పుడు చెప్పే ఆకు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆ ఆకు తిప్పతీగ. తిప్పతీగ ఇమ్యూనిటీపవర్ పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇది మన ఇంటి పరిసరాలలో ఎక్కడపడితే అక్కడ కనబడుతుంది కానీ మనకు అది తిప్పతీగ అనే విషయం తెలీదు.
అలాగే దీనిలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న విషయం కూడా తెలీదు ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలు తెలుసుకుంటే తప్పనిసరిగా తిప్పతీగ ను వాడటం ప్రారంభిస్తారు. అలాగే ఒకవేళ ఇంట్లో లేకపోతే పెంచుకుంటారు. పూర్వకాలం నుండి ఆరోగ్యపరంగా తిప్పతీగను ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. తిప్పతీగ చూర్ణాన్ని ప్రతిరోజు తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
తిప్పతీగ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగ నిరోధక శక్తిని బలపరచి ఫ్రీ రాడికల్స్ తో పోరాటం చేస్తాయి.దగ్గు జలుబు గొంతు నొప్పి ఉన్న వారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో తిప్పతీగ చూర్ణం మరియు అల్లం రసం కలిపి తీసుకుంటే దగ్గు జలుబు జ్వరం గొంతు నొప్పి నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి ఇటువంటి మొక్కలను ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. తిప్పతీగను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.