MoviesTollywood news in telugu

మంచు లక్ష్మి బాలనటిగా నటించిన సినిమాలు ఏమిటో తెలుసా?

Manchu Lakshmi Movies :తెలుగు చిత్ర సీమలో డైలాగ్ కింగ్ అనగానే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గుర్తొస్తాడు. డిఫరెంట్ విలనిజం,కామెడీ విలనిజం పండించడంలో మోహన్ బాబుకి మరెవ్వరూ సాటిరారు. హీరోగా కూడా మంచి సక్సెస్ అందుకున్న మోహన్ బాబు తన ఇద్దరు కొడుకులు,కూతురికి కూడా నట వారసత్వం అందించాడు. ఇందులో మంచు లక్ష్మి రూటే వేరు.

అమెరికన్ ఇంగ్లీషులో తెలుగు విరుపును చూపిస్తూ మాట్లాడే మంచు లక్ష్మి నిజానికి అమెరికన్ తెలివిజన్స్ లో లెక్కలేనన్ని సీరీస్ లో నటించి, ఇంగ్లీషు మూవీస్ లో కూడా నటించి,టెలివిజన్ ప్రెజెంటర్ గా సత్తా చూపించింది. ఇక అమెరికా నుండి వచ్చీ రావడంతోనే అనగనగా ధీరుడు మూవీలో మంచు లక్ష్మి విలన్ గా నటించి తన స్టామినా ఏమిటో చూపించింది.

అయితే చిన్నప్పుడు ఓ తెలుగు మూవీలో స్పెషల్ గా నటించింది. ఆ విషయం చాలామందికి తెలీదు. తన తమ్ముళ్లు మంచు విష్ణు ,మంచు మనోజ్ ఇంకా పుట్టకుండానే తెలుగు తెరమీద తన స్టామినా చూపించింది. సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై వచ్చిన పద్మవ్యూహం మూవీలో మోహన్ బాబు రెండు పాత్రలు పోషించాడు. అందులో ఒకటి గుడి పూజారి వేషం. అతడికి చిన్న కూతురి పాత్రలో మంచు లక్ష్మి నటించింది. మంచు లక్ష్మి ఆ సినిమాలో సొంత వాయిస్ లో నటించడమే కాదు , ఒకపాటలో కూడా కనిపిస్తుంది.

‘దిగు దిగు నాగ,దిగు దిగు సుందర నాగ’ అంటూ సాగే పాటలో నటించి అప్పట్లో ప్రశంసలు అందుకుంది. జిసి శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పద్మ వ్యూహం మూవీ 1980లో విడుదలై మంచి హిట్ కొట్టింది. ఇక తమ్ముళ్లు సినిమా హీరోలుగా నిలదొక్కుకోడానికి ప్రయత్నాలు చేస్తుంటే,బుల్లితెరపై అలాగే వెండితెరపై కూడా మంచు లక్ష్మి తానేమిటో నిరూపించుకుంది. నిర్మాతగా పలు సినిమాలు నిర్మిస్తూ, విభిన్న పాత్రల్లో నటిస్తూ మంచు లక్ష్మి తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది.