20 ఏళ్ల నుండి ఉన్న నొప్పులను సైతం తగ్గించి పరిగెత్తించే అద్భుతమైన చిట్కా
Joint Pains Home Remedies In telugu : ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి వాటితో బాధపడుతున్నారు. ఇప్పుడు చెప్పే చిట్కా ద్వారా ఈ నొప్పులను తగ్గించుకోవచ్చు. పురాతన కాలం నుండి ఈ చిట్కాను వాడుతున్నారు
ఈ చిట్కా కోసం ముందుగా ఒక బౌల్ లో ఒక స్పూను బెల్లం తీసుకోవాలి. దానిలో అరస్పూన్ పసుపు ఒక స్పూన్ .కిల్లీల కోసం ఉపయోగించే సున్నం వేసి బాగా కలపాలి. ఇది ఒక చిక్కని మిశ్రమంలా తయారు అవుతుంది. అవసరమైతే కొంచెం నీటిని కూడా కలపొచ్చు. నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని రాసి దానిపైన ఒక తమలపాకు పెట్టి ఒక క్లాత్ కట్టుగా కట్టాలి.
ఈ విధంగా చేయడం వల్ల నొప్పి ఉన్న ప్రదేశంలో గట్టిగా తయారయ్యి నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. కండరాలు బిగుతుగా ఉండేందుకు సహాయ పడుతుంది. బెల్లం., పసుపు అనేవి నొప్పి తగ్గించడానికి సహాయపడతాయి. సున్నం calcium లోపాన్ని తగ్గిస్తుంది. ఈ విధంగా రాత్రి సమయంలో వేసుకుని మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే నొప్పులు తగ్గుతాయి.
ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.అలాగే ఒక గ్లాసు పాలలో ఒక స్పూన్ బెల్లం తురుము వేసి బాగా కలిపి ప్రతి రోజూ తాగుతూ ఉంటే ఎముకలు బలంగా ఉండటమే కాకుండా కీళ్ల నొప్పుల కూడా తగ్గుతాయి. బెల్లం ఆర్గానిక్ బెల్లం వాడితే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.