పాలకూర, టమాటా కలిపి తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయంటారు… నిజం ఎంత…?
Palakura and tomato : కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటానికి కాల్షియం ఆక్జటేట్,యూరిక్ యాసిడ్,ఫాస్పరస్ వంటివి కారణం అవుతాయి. అయితే ఎక్కువగా కాల్షియం ఆక్జటేట్ కారణంగానే కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడతాయి. మనం ఆక్జటేట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుంటే సమస్య వచ్చే అవకాశం ఉంది. కిడ్నీల్లో రాళ్ళతో బాధపడి ఉన్నవాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
అంటే పాలు, పాలకూర, టమాటా వంటి ఆహారాలలో ఎక్కువగా ఆక్జటేట్ ఉంటుంది. అందువల్ల వారిలో రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పాలకూర, టమోటాలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
పాలకూర, టమాటాలలో అధిక మోతాదులో ఉన్న ఆక్జలేటులు మన రక్తంలో ఉన్న కాల్షియం, ఇనుము లవణాలను ఆయా ఆక్జలేటులుగా మార్చే పరిస్థితి ఉంది.రక్తంలోనూ, మూత్రంలోనూ సరైన మోతాదులో నీటి శాతం లేనట్త్లెతే రసాయనికంగా ఆక్జలేట్ల పరిమాణం, ఫాస్పేట్ల పరిమాణం మోతాదును మించి ఉంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
మోతాదును మించితేనే ప్రమాదం. పరిమిత స్థాయిలో పాలకూర టమాటాలను కలిపి తిన్నంత మాత్రాన కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. అయితే రోజూ నీళ్లు ఎక్కువగా తాగితే ఈ ప్రమాదం ఉండదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా తింటే ఎటువంటి సమస్యలు ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.