టాలీవుడ్ టాప్ హీరోలకు సైడ్ బిజినెస్ లు ఎన్ని ఉన్నాయో చూడండి
Side Business of Tollywood Top Heros :దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క యాడ్స్,వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. కొందరు టివి షోస్ లో హోస్ట్ గా చేస్తున్నారు. కింగ్ Nagarjuna సినిమాలు చేస్తూనే,రెస్టారెంట్స్,పబ్ బిజినెస్ లలో ఆరితేరాడు. ఇక అన్నపూర్ణ థియేటర్ నిర్వహణ,సినిమాల నిర్మాణం సరేసరి. మొన్నటి దాకా మా టివిలో కొంత వాటా ఉండేది.
Ram Charan సినిమాలు చేస్తూనే నిర్మాతగా తండ్రి మెగాస్టార్ తో,ఇతర హీరోలతో సినిమాలునిర్మిస్తూ మరోపక్క ట్రూజెట్ పేరిట విమాన సర్వీసులు నడుపుతున్నాడు.
సూపర్ స్టార్ Mahesh Babu సినిమాలు చేస్తూనే యాడ్స్ లో నటిస్తూ, వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టాడు. నిర్మాతగా మారడంతో పాటు ఏషియన్ మూవీస్ తో కల్సి ఏ ఎం బి మల్టీఫ్లెక్స్ థియేటర్ గచ్చీబౌలిలో అధునాతన వసతులతో నిర్మించాడు. తాజాగా మేన్స్ వేర్ క్లాత్ బిజినెస్ మొదలు పెట్టాడు.
Allu Arjun అయితే సినిమాలతో పాటు జూబ్లీ హిల్స్ లో పబ్ ని స్టార్ట్ చేసి, గచ్చీ బౌలీ ఏరియాలో ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేసాడు.అమీర్ పేట సత్యం థియేటర్ ని మల్టీఫ్లెక్స్ గా మారుస్తున్నాడు.
శర్వానంద్ కూడా జూబ్లీ హిల్స్ లో బెంజ్ పేరిట కాఫీ హౌస్ స్టార్ట్ చేసాడు. మోహన్ బాబు శ్రీ విద్యా నికేతన్ పేరిట స్కూల్ నిర్వహిస్తుండగా, జూబిలీ హిల్స్ లో న్యూ యార్క్ అకాడెమీ పేరిట స్కూల్ స్టార్ట్ చేసాడు.
Jagapati Babu క్లిక్ కార్ట్ పేరుతొ టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ స్టార్ట్ చేసాడు. రౌడీ స్టార్ Vijay Devarakonda వరుస మూవీస్ చేస్తూ, క్లాత్ బిజినెస్ రౌడీ బ్రాండ్ పేరిట స్టార్ట్ చేసాడు. ఏవిడి పేరిట ఏషియన్ సినిమాతో కల్సి మహబూబ్ నగర్ లో థియేటర్ నిర్మాణం చేసాడు.
సందీప్ కిషన్ 2016లోనే వివాహ భోజనంబు పేరిట రెస్టారెంట్ స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో మూడు రెస్టారెంట్స్ ఉన్నాయి. నందమూరి కల్యాణరామ్ హీరోగా చేస్తూనే సినిమాలు నిర్మిస్తూ, మరోపక్క అద్విత పేరిట క్రియేటివ్ పేరిట వి ఎఫ్ ఎక్స్ స్టూడియో స్టార్ట్ చేసాడు.