MoviesTollywood news in telugu

SIR: ధనుష్ సూపర్ హిట్ సార్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో

Dhanush sir movie :కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌ తెలుగులో డైరెక్ట్ గా నటించిన సినిమా ‘సార్’. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. భీమ్లానాయక్‌తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సంయుక్త మేనన్‌ హీరోయిన్‌గా నటించింది. మహాశివరాత్రి కానుకగా శుక్రవారం (ఫిబ్రవరి 17)న అభిమానుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సూపర్‌హిట్‌ టాక్‌ వచ్చింది.

తమిళంలో వాతి పేరుతో రిలీజ్‌ కాగా అక్కడ కూడా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ప్రస్తుతం మన విద్యా వ్యవస్థలో ఉన్న అక్రమ వ్యాపారాలను కళ్లకు కట్టినట్లు చూపించారని సార్‌ సినిమాపై విమర్శకుల సైతం ప్రసంసలు కురిపిస్తున్నారు.

సార్‌ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. డైరెక్టర్ వెంకీ సార్‌ సినిమా కథను మొదట న్యాచురల్ స్టార్ నానికి వినిపించాడట. నాని నో చెప్పటంతో ధనుష్‌ వద్దకు ఈ కధ వెళ్ళింది.