MoviesTollywood news in telugu

Venkatesh చేసిన రీమేక్స్ లో బెస్ట్ మూవీస్ ఇవే…మీరు చూసారా…?

Victory Venkatesh Top 10 Remake Movies :నిర్మాత డాక్టర్ డి రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ అనతి కాలంలోనే విక్టరీ వెంకటేష్ అయ్యాడు. అయితే ఇందుకు రీమేక్ మూవీస్ బాగా దోహదం చేసాయి. ముఖ్యంగా కథకు ఎక్కువ ప్రాధ్యాన్యత గల సినిమాలకే మొగ్గు చూపించాడు.

పలువురు నటుల సినిమాలను వెంకీ రీమేక్ లో నటించి తన సత్తా చాటాడు. తాజాగా వచ్చిన నారప్ప మూవీ కూడా తమిళంలో వచ్చిన అసురన్ మూవీకి రీమేక్. సినిమా ఎలా ఉన్నా వెంకీ తన నటనతో అదరగొట్టేసాడు. డైరెక్టర్ అడ్డాల శ్రీకాంత్ సెకండాఫ్ లో మరింత పదును పెడితే బాగుండేది. వెంకీ కెరీర్ లో బెస్ట్ యాక్షన్ మూవీగా ఇది నిలిచిపోతుంది

అలాగే ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అనే మూవీ తెలుగులో వెంకీ చేసిన తర్వాత తమిళంలో ధనుష్ చేసాడు.అందుచేత ఒకరి నటనను ఒకరితో పోల్చడం సరికాదని విశ్లేషకుల భావన. నిజానికి రీమేక్ లో నటించాలంటే చాలా కష్టపడాలి. కానీ వెంకీ చాలా సులువుగా నటించి చూపించాడు.

తమిళంలో సూపర్ హిట్ అయిన సూర్యవంశం అదే టైటిల్ తో వెంకీ తెలుగులో చేసి,బ్లాక్ బస్టర్ కొట్టాడు. తమిళంలో విక్రమ్ నటించిన జెమిని మూవీని తెలుగులో జెమినిగా వెంకీ చేసాడు. అయితే ఇది తెలుగులో ప్లాప్ అయింది. తమిళంలో సూర్య నటించిన కాకా కాకా మూవీకి రీమేక్ గా తెలుగులో ఘర్షణ మూవీ వెంకీ చేసాడు. తమిళంలో భాగ్యరాజ్ నటించిన మూవీకి రీమేక్ గా తెలుగులో సుందరకాండ చేసి భాగ్యరాజాను మరపించాడు.

వెడ్నెస్ డే హిందీ మూవీకి రీమేక్ గా తెలుగులో ఈనాడు మూవీలో నటించాడు. కమల్ హాసన్ ని డామినేట్ చేసేవిధంగా నటించాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ ఓ మై గాడ్ మూవీకి రీమేక్ గా గోపాల గోపాల మూవీ చేసాడు. ఇందులో పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ వెంకీ తనదైన నటనతో అలరించి మెప్పించాడు.

ప్రభు హీరోగా చేసిన చిన్న తంబి మూవీని చంటి పేరుతొ వెంకీ చేసిన నటన అద్భుతం.ఇండస్ట్రీ హిట్ అయింది. నిజానికి దీన్ని రీమేక్ చేయడానికి తెలుగులో ఏ హీరో సాహసం చేయలేదు. మాధవన్ హిందీలో నటించిన హిందీ మూవీకి రీమేక్ గా తెలుగులో వెంకీ గురు మూవీ చేసాడు. ఇక మలయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం మూవీకి రీమేక్ గా తెలుగులో అదే పేరుతొ రీమేక్ లో వెంకీ చేసిన నటన అదుర్స్.