వంకాయను ఎక్కువగా తింటున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు
Brinjal Side Effects In telugu : వంకాయలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంకాయను ఎగ్ ప్లాంట్ అని పిలుస్తారు. వంకాయ సొలనేసి కుటుంబానికి చెందినది. వంకాయ సాధారణంగా గుండ్రంగా లేదా సన్నగా,పొడవుగా ఉంటాయి. వంకాయకు నిగనిగలాడే చర్మం ఉంటుంది.
వంకాయ లోపల భాగం మృదు కణజాలము మరియు అనేక చిన్న కేంద్రాల ఏర్పాటుతో క్రీమ్ రంగుతో మృదువైన విత్తనాలు ఉంటాయి. వంకాయ కూరను అందరూ ఇష్టంగా తింటారు. కానీ వంకాయలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు వంకాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
వంకాయలో ప్రోటీన్,విటమిన్ సి మరియు ఇనుము, కాల్షియం,పొటాషియం,ఫాస్పరస్,ఫోలిక్ ఆమ్లం,బీటా కెరోటిన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. వంకాయలో ఫైబర్ మరియు పిండిపదార్థాలు సమృద్ధిగా ఉండుట వలన డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించటమే కాకుండా గ్లూకోజ్ శోషణను నియంత్రిస్తుంది.
వంకాయలో ఫినాల్స్ మరియు అత్యల్ప గ్లైసెమిక్ సూచిక ఉండడం వలన డయాబెటిస్ ఉన్న వారికి ఉత్తమ ఆహారం అని చెప్పవచ్చు. వంకాయలో యాంటీ ఆక్సిడెంట్స్,ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణక్రియలో సహాయపడుతుంది. అంతేకాక జీర్ణ సంబంధ సమస్యలు మలబద్దకం,గ్యాస్,అల్సర్ వంటివి తగ్గుతాయి.
వంకాయను మెత్తగా మేష్ చేసి దానిలో ఇంగువ మరియు వెల్లుల్లి తో టాపింగ్ చేసుకొని తీసుకుంటే మూత్రనాళం సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది. వంకాయలో అధికంగా ఫైబర్,నీరు తక్కువగా కేలరీలు ఉంటాయి. అందువల్ల వంకాయ తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో తీసుకొనే ఆహారం క్వాంటిటీ తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గుతాం.
శరీరంలో విషాలను బయటకు పంపటంలో సహాయాపడుతుంది. వంకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఒక ప్రభావవంతమైన యాంటీ వైరల్ మరియు యాంటీ బాక్టీరియా లక్షణాలు ఉంటాయి. వంకాయ రసాన్ని అరచేతులు మరియు అరికాళ్ళకు రాస్తే చెమట పట్టటం తగ్గుతుంది. అంతేకాక శరీర వాసనలను తగ్గిస్తుంది.
వంకాయలో దాదాపు సోడియం తక్కువగా ఉండుట వలన అధిక రక్తపోటును నిరోధిస్తుంది. గుండె జబ్బులు,స్ట్రోక్ మరియు మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్నికూడా తగ్గిస్తుంది. వంకాయలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికి…కొన్ని సమస్యలు ఉన్నవారు వంకాయను తక్కువగా తీసుకోవాలి…లేదంటే వంకాయకు దూరంగా ఉండాలి.
కంటి సమస్యలు ఉన్నవారు వంకాయకు దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే వంకాయలో ఉన్న లక్షణాలు కంటిలో దురద, మంట,వాపు సమస్యలను పెంచుతుంది. పైల్స్ సమస్య ఉన్నవారు తింటే సమస్య తీవ్రం అవుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు పొరపాటున కూడా వంకాయను తినకూడదు.
ఎందుకంటే వంకాయలో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీల్లో రాళ్లను పెంచుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు వంకాయను తింటే రక్తం పెరగకుండా అడ్డుపడుతుంది. అంటే శరీరంలో ఐరన్ శోషణ తగ్గుతుంది. డిప్రెషన్ సమస్యలకు మందులు వాడేవారు వంకాయకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మానసిక సమస్యలను పెంచే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి.
అలెర్జీ ఉన్నవారు కూడా వంకాయకు దూరంగా ఉండాలి. అలాగే కొన్ని చర్మ సమస్యలు ఉన్నవారు కూడా వంకాయ తింటే ఆ సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు తింటే ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వంకాయను లిమిట్ తిని ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.