ఈ గింజలు నరాల బలహీనత,చెడు కొలెస్ట్రాల్,మధుమేహం అనేవి జీవితంలో లేకుండా చేస్తాయి
bobbarlu benefits In Telugu : నవ ధాన్యాలలో ఒకటైన బొబ్బర్లలో ఎన్నో పోషకాలు మరియు ఆరోగ్య ప్రయూజనాలు ఉన్నాయి. బొబ్బర్లను అలసందలు అని కూడా పిలుస్తారు. బొబర్లతో వడలు వేసుకుంటారు. అలాగే ఉడికించి ఉల్లి,పచ్చిమిర్చి,నిమ్మరసం కలిపి తింటూ ఉంటారు. బొబర్లలో ఉండే ఫ్లవనాయిడ్స్, పొటాషియం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి రక్తప్రసరణ బాగా సాగేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది. బొబ్బర్లలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణప్రక్రియ వేగవంతం అవుతుంది. అధిక బరువు సమస్య ఉన్నవారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. వీటిని తినటం వల్ల ఎక్కవ సేపు కడుపులో ఆకలి వేయకుండా ఉంటుంది. దాంతో బరువు తగ్గుతారు.
అలాగే మధుమేహం ఉన్నవారు వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వీటి గ్లైజమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.
శరీరంలో హానికారక టాక్సిన్స్ ను నియంత్రిస్తాయి. వీటిల్లో ఉండే విటమిన్ కె నరాలకు బలాన్నిస్తుంది. ఐరన్ , మెగ్నీషియం, ఎనర్జీ లెవల్స్ పెరిగేలా చేస్తాయి. నరాల బలహీనత ఉన్నవారు బొబ్బర్లను రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది.
బొబ్బర్లలో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మంను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఎ, సిలు ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి హాని జరగకుండా, చర్మ కణాలను రక్షిస్తాయి. కాబట్టి బొబ్బర్లను తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.