Healthhealth tips in telugu

డయాబెటిస్ ఉన్నవారికి ఈ ఆకులు దివ్య ఔషధం … పంచదారకు బ‌దులు ఈ ఆకులు వాడితే ఏమ‌వుతుందో తెలుసా?

Stevia Leaves in Telugu : డయాబెటిస్ అనేది ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి లోనూ కనిపిస్తుంది. డయాబెటిస్ వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడాల్సిందే. ముఖ్యంగా వీరు స్వీట్స్ కి చాలా దూరంగా ఉండాలి. అలాగే కాఫీ., టీలలో పంచదార వేసుకోకూడదు. పంచ‌దార‌కు బ‌దులుగా ఒక ఆకు ఉంది. దానిపేరు మధుపత్రి.
Diabetes In Telugu
ఈ మొక్కలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. డయాబెటిస్ తో బాధపడేవారు మ‌ధుప‌త్రి (స్టివియా) ఆకుల‌ను ప్ర‌తిరోజు న‌మిలి తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద వైధ్య నిపుణులు చెప్పుతున్నారు. ఈ మొక్క ఆకులు పంచదార కన్నా 30 రేట్లు తియ్యగా ఉంటాయి. ఈ మొక్క ఆకులను నోట్లో వెసుకోని చ‌ప్ప‌రిస్తే అచ్చం పిప్ప‌రుమేంట్ బిల్ల‌లాగా ఉంటుంది.
Stevia Leaves
మధుప‌త్రి ఆకుల‌ను ఆరబెట్టి పొడి చేసుకొని పంచదారకు బదులు వాడవచ్చని నిపుణులు చెప్పుతున్నారు. ఈ ఆకుల పొడి ఒక స్పూన్ ఒక కప్పు సాదారణ పంచదారతో సమానం. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు పంచదారకు బదులు మధుప‌త్రి ఆకుల పొడిని వాడవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ వైర‌ల్ , యాంటీ సెప్టిక్ , యాంటి ఇన్ఫ్ల‌మేట‌రీ లక్షణాలు ఉంటాయి.

ఈ మధుపత్రి తులసి జాతికి చెందినది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నోటి దుర్వాసన తో ఇబ్బంది పడుతుంటే.. మౌత్‌ ఫ్రెష్‌నర్‌గా ఈ మొక్క ఆకులను ఉపయోగించ వచ్చు. ఈ ఆకులను తినటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి గ్యాస్,ఎసిడిటీ,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వీటిని వాడే ముందు ఒకసారి ఆయుర్వేద వైధ్య నిపుణున్ని సంప్రదించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.