Nagarjuna మాస్ సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?
Nagarjuna Mass Movie :కొరియో గ్రాఫర్ గా పాపులార్టీ తెచ్చుకున్న రాఘవ లారెన్స్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ తీసిన మాస్ సినిమా కింగ్ నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ గా నిల్చింది. అంతేకాదు యూత్ లో నాగ్ కి మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. జ్యోతిక, ఛార్మి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో నాగ్ ని ఫాన్స్ కి అనుగుణంగా చూపించడంలో లారెన్స్ సక్సెస్ అయ్యాడు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ మూవీకి అదనపు బలాన్ని ఇచ్చింది. 2004డిసెంబర్ 23న రిలీజైన ఈ సినిమాకు కొంచెం అటు ఇటూ తేడాలో రిలీజై పోటీ ఇచ్చిన సినిమాల వివరాల్లోకి వెళ్తే, రెండు వారాల ముందు రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ నలుగురు మూవీ వచ్చింది. చంద్ర సిద్ధార్ధ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.
విద్యార్థి మూవీ కూడా అదేరోజు రిలీజయింది. జితిన్ రమేష్ నటించిన ఈ మూవీ ప్లాపయింది. ఇదే రోజు అంజలి ఐ లవ్ యు మూవీ రిలీజయింది. సంతోష్ పవన్ నటించిన ఈ మూవీ ని డివిఆర్ కళింగ తెరకెక్కించగా, సినిమా నిరాశ పరిచింది. డిసెంబర్ 15న నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన విజయేంద్ర వర్మ రిలీజయింది. లయ, అంకిత హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని స్వర్ణ సుబ్బారావు తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయింది.
మాస్ తో పాటు విశాల్, భరత్, రీమాసేన్ నటించిన ప్రేమ చదరంగం మూవీ వచ్చింది. ఏ ఆర్ గాంధీ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిరాశ పరిచింది. మాస్ వచ్చిన రెండు వారాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బాలు మూవీ రిలీజయింది. శ్రేయ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఏవరేజ్ అయింది.
మాస్ కి మూడు వారాల గ్యాప్ తో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నా అల్లుడు మూవీ రిలీజయింది. రమ్యకృష్ణ అత్తగా నటించిన ఈ మూవీలో తారక్ సరసన జెనీలియా, శ్రేయ నటించారు. ఓపెనింగ్స్ బాగున్నా తర్వాత స్లో అయింది. దాంతో మాస్ బ్లాక్ బస్టర్ కావడం, ఆ నలుగురు కూడా మంచి విజయాన్ని నమోదుచేసింది.