భారీ అంచనాలతో విడుదలై బోల్తా కొట్టిన బాలయ్య మూవీస్
Tollywood hero balakrishna failed movies :సినిమా జయాపజయాలు ఆడియన్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఒక్కోసారి అంచనాలు పెద్దగా లేకున్నా సూపర్ హిట్ అయిపోతాయి. మరి కొన్ని సార్లు భారీ అంచనాల నడుమ రిలీజ్ చేస్తే బోల్తా కొడతాయి. నందమూరి నటసింహం సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ లు ఉన్నట్లే ఎన్నో డిజాస్టర్స్ ఉన్నాయి. అంచనాల మధ్య రిలీజై, ప్లాప్ అయిన కొన్ని సినిమాల జాబితాలోకి వెళ్తే, వీరభద్ర,పల్నాటి బ్రహ్మనాయుడు, శ్రీమన్నారాయణ, వంశోద్ధారకుడు వంటి సినిమాలు ఎన్నో ప్లాప్ అయ్యాయి.
1983లో వచ్చిన జననీ జన్మభూమిశ్చ మూవీలో సుమలత హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో సత్యనారాయణ,శారద,పిజె శర్మ,సాక్షి రంగా రావు వంటి దిగ్గజ నటులున్నా సరే, డిజాస్టర్ అయింది. ఇక 1985లో సుమలతతో కల్సి నటించిన కత్తుల కొండయ్య మూవీ కూడా బాలయ్యకు నిరాశ మిగిల్చింది. 1987లో రిలీజయిన అల్లరి క్రిష్నయ్య మూవీ కూడా ఫైయిల్ అయింది. భానుప్రియ హీరోయిన్ నందమూరి రమేష్ డైరెక్ట్ చేసాడు. అదే ఏడాది ప్రతిష్టాత్మకంగా వచ్చిన సహస సామ్రాట్ కూడా ఘోరంగా దెబ్బతింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసారు.
1990లో చలసాని రామారావు డైరెక్షన్ లో వచ్చిన ప్రాణానికి ప్రాణం మూవీ కూడా డిజాస్టర్ అయింది. రజనీ హీరోయిన్. నటరత్న ఎన్టీఆర్ నటించి, దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ లో బాలయ్య నటించాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర అంచనా తప్పింది. బాలయ్యకు జోడిగా విజయశాంతి నటించి, నిర్మించిన నిప్పురవ్వ మూవీ దారుణంగా దెబ్బతింది. ఏ కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసాడు. 1997లో బాలయ్య, రమ్యకృష్ణ జంటగా నటించిన దేవుడు మూవీ రిలీజై, ఫెయిల్ అయింది. అలాగే 1999లో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చిన కృష్ణబాబు మూవీ కూడా నిరాశపరిచింది.