వెంకటేష్ చంటి సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరు?
Venkatesh Chanti Movie :రీమేక్ సినిమాలకు అగ్ర తాంబూలం ఇచ్చే హీరో విక్టరీ వెంకటేష్. యితడు నటించిన సుందరకాండ మొదలు మొన్నటి దృశ్యం వరకూ ఎన్నో రీమేక్ మూవీస్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే 1992 జనవరి 10న విడుదలైన చంటి చిత్రం వెంకీకి ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది. తమిళంలో ఘన విజయం సాధించిన చినతంబి మూవీకి రీమేక్ గా వచ్చింది. దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వెంకీ హీరోగా మీనా హీరోయిన్ గా వచ్చిన ఈ మూవీ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది.
అయితే ఈ మూవీని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌తో చేయాలని దర్శకుడు రవిరాజా పినిశెట్టి భావించారట. తమిళ వెర్షన్ చూసాక ఆయనకు అలా తోచింది. అయితే అదే సమయంలో రామానాయుడు,సురేష్,వెంకటేష్‌లు కూడా చినతంబిని చూసి వెంకటేష్‌తో తీయమని రవిరాజాను సంప్రదించారు. నిజానికి అప్పటికే రాజేంద్రప్రసాద్‌కు మాట ఇచ్చి ఉండడం వలన వెంకటేష్‌తో చేయలేనని చెప్పారు.
అవసరమైతే ప్రాజెక్టు నుంచి తప్పుకుందామనుకోవాలని రవిరాజా భావించారు. మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకుని వెంకటేష్‌తో చంటి సినిమా చేయడానికి రవిరాజాను ఒప్పించారు. పాత్రకు తమిళంలో చిన్నతంబిలో చేసిన ఖుష్బూను హీరోయిన్ తీసుకుందామనుకుంటే, ఆమె అదే పాత్ర మళ్ళీ తెలుగులో చేయనని తేల్చేయడంతో మీనాను సంప్రదించారు. ఆమె ఒప్పుకోవడంతో సినిమా తెరకెక్కింది.