ఈ నందమూరి హీరో గుర్తు ఉన్నాడా….ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?
Tollywood Hero Kalyan Chakravarthy :ఒకప్పుడు ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ తో నందమూరి కల్యాణ చక్రవర్తి ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. హీరోగా, క్యారెక్టర్ యాక్టర్ గా తన నటనతో ఆకట్టుకున్న యితడు సడన్ గా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇంటిదొంగ,మేనమామ,అక్షింతలు,తలంబ్రాలు,దొంగకాపురం తదితర ఫ్యామిలీ మూవీస్ తో పాటు రౌడీ బాబాయ్,రుద్రరూపం వంటి యాక్షన్ మూవీస్ కూడా చేసాడు. భక్త కబీర్ దాస్ మూవీలో శ్రీరాముడుగా అలరించాడు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన లంకేశ్వరుడు మూవీలో కూడా కీలక పాత్ర పోషించాడు. తర్వాత అనుకోకుండా చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో కొడుకు పృథ్వి చనిపోవడం, తండ్రి గాయపడడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇంతకీ ఈ నందమూరి వారసుడు ఎవరనే వివరాల్లోకి వెళ్తే, ఇండస్ట్రీకి రెండు కళ్ళుగా భావించే ఎన్టీఆర్,అక్కినేని ల నట వారసులు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎన్టీఆర్ తనయుడు బాలయ్య,అక్కినేని తనయుడు నాగార్జున తమదైన బాణీలో నటనను ప్రదర్శించి ఫాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.
అయితే ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు పలు సినిమాలకు నిర్మాతగా పనిచేసారు. ఎన్టీఆర్ ని వెన్నంటి ఉండేవారు.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక బాలకృష్ణ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న సమయం లోనే త్రివిక్రమరావు తనయుడు కల్యాణ చక్రవర్తి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. దాంతో టాలీవుడ్ లో అడుగుపెట్టి, డిఫరెంట్ మూవీస్ తో కల్యాణ చక్రవర్తి ఆకట్టుకున్నాడు. కొడుకు మరణించి,తండ్రి గాయపడడంతో చెన్నైలోనే ఉండిపోయి,టాలీవుడ్ కి దూరమయ్యాడు. తండ్రి మరణం తర్వాత కూడా వ్యాపారాలు చూసుకుంటూ చెన్నైలోనే స్థిరపడిపోయాడు.మొత్తానికి ఓ ప్రమాదం ఒక మంచి నటుణ్ని ఇండస్ట్రీకి దూరం చేసింది.