బృందావనం సినిమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?
Ntr Brundavanam Telugu Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో బృందావనం మూవీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అప్పటి వరకు ఊర మాస్ హీరోగా రాణించిన తారక్ కెరీర్ ని ఫామిలీ స్టోరీ వైపు అనూహ్యంగా మలుపు తిప్పిని సినిమా ఇది. అందుకే ఈ మూవీతో క్లాస్‌లో కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
2010లో సింహా తర్వాత అతిపెద్ద హిట్‌గా ఈ మూవీ నిలిచింది. తొలి సారి ఎన్టీఆర్, కాజల్, సమంతతో జోడీ కట్టిన ఈ మూవీ ఎన్టీఆర్‌కు ఫ్యామిలీస్‌లో మంచి ఇమేజ్ తెచ్చింది. ఇక హీరోయిన్గా సమంతకు ఇది రెండో చిత్రం కావడం విశేషం. సినిమాకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ కాసేపు శ్రీకృష్ణుడిగా పించం, పిల్లనగ్రోవితో కాసేపు కనిపించి అభిమానులను అలరించాడు.
సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు గా వంశీ పైడిపల్లి వ్యవహరించాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్లో ఎన్టీఆర్‌కు మొదటి మూవీ ఇది. తమన్ అందించిన బాణీలు సూపర్ హిట్. ఇక ఈ చిత్రానికి కొరటాల శివ మాటలు అందించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ కెరీర్లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.
‘బృందావనం’ మూవీ పలు కేంద్రాల్లో 100 రోజులకు పైగా నడిచింది. ‘బృందావనం’ తర్వాత ఎన్టీఆర్ , కాజల్‌తో కలిసి ‘బాద్షా’, టెంపర్’ మూవీస్ చేసాడు. జనతా గ్యారేజ్‌లో కాజల్ పక్కా లోకల్ అనే ఐటెం సాంగ్‌లో మెరిసింది. సమంత కూడా ఈ చిత్రం తర్వాత ‘రామయ్య వస్తావయ్యా, ‘రభస’, జనతా గ్యారేజ్ చిత్రాల్లో నటించింది. బృందావనం రిలీజ్ అయ్యి, 10 యేళ్లు పూర్తి చేసుకుంది. తెలుగులోనే కాదు ‘బృందావనం’ సినిమా కన్నడ, ఒరియా, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ, వంటి పలు భాషల్లో రీమేక్ చేయగా అక్కడా సూపర్ హిట్ అయింది.