నరనరాల్లో బలాన్ని పెంచి డయాబెటిస్,బరువును తగ్గించే ప్రోటీన్ రోటి
High Protein Roti : ప్రోటీన్ సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకుంటే మన శరీరంలో సమస్యలు పెద్దగా రావు. ఇప్పుడు చెప్పే రోటి వారంలో రెండు సార్లు తీసుకుంటే డయాబెటిస్,అధిక బరువు తగ్గటమే కాకుండా నరాలు బలంగా ఉంటాయి. ఒక కప్పు నానబెట్టిన పెసలు, అరకప్పు నానిన బొబ్బర్లను మిక్సీలో వేసి రఫ్ గా మిక్సీ చేసి ఒక బౌల్ లో వేసుకోవాలి.
ఆ తర్వాత అరకప్పు వేగించిన వేరుశనగ పొడి,అరకప్పు వేగించిన నువ్వుల పొడి,అరకప్పు జొన్న పిండి,ఒక కప్పు పాలకూర,అరకప్పు పుదీనా,అరకప్పు క్యారెట్, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు,ఒక స్పూన్ అల్లం తురుము,ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ నిమ్మరస, అరస్పూన్ పసుపు,సరిపడా ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి.
ఈ మిశ్రమంను చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక్కో ముద్దను రోటి మాదిరిగా ఒత్తి పెనం మీద మీగడ వేసి కాల్చాలి. ఈ రోటిలను రోజుకి రెండు తింటే సరిపోతుంది. వీటిని వారంలో రెండు సార్లు ఉదయం లేదా రాత్రి సమయంలో తీసుకోవచ్చు. ఈ రోటిలను తీసుకుంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది.
ప్రోటీన్ లోపం వల్ల జీవక్రియ నెమ్మదించడం, రోగనిరోధకత తగ్గడం, కీళ్ళ, కండరాల నొప్పులు, జుట్టు రాలటం, గోళ్ళ పేలుసుగా మారటం.మానసిక కల్లోలం , శక్తి తగ్గడం , అలసట, పిల్లల్లో ఎదుగుదల సరిగా లేకపోవటం , మూత్రపిండాలు సరిగా పని చేయకపోవుట, రక్తహీనత వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి.
ఈ రోటి తింటే ప్రోటీన్ లోపం తొలగిపోతుంది. వారంలో రెండు సార్లు ఈ రోటిలను తినటానికి ప్రయత్నం చేయాలి. కాస్త ఓపికగా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇలా రోటిలను చేసుకుని తింటే చాలా మంచిది. ఈ రోటిలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ మనకు సులభంగా అందుబాటులో ఉండేవే.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.