Healthhealth tips in telugu

ఒత్తిడి,ఆందోళన,టెన్షన్,తలనొప్పి,మానసిక సమస్యలను తగ్గించే అద్భుతమైన టీ

Matcha Tea Benefits in telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఒత్తిడి అనేది ఉంటుంది. ఒత్తిడి లేకుండా జీవించడం చాలా కష్టం అవుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మాచా టీ తాగితే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. మాచా టీని తాగడం వల్ల ఆ పొడిలో ఉండే ఔషధ కారకాలు మన శరీరంలో డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లను యాక్టివేట్ చేసి ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ ని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
matcha tea
వేడి నీటిలో మాచా టీపొడిని కలుపుకొని… ఫిల్టర్ చేసి తాగితే చాలు. లేదంటే… మాచా టీ పొడి బ్యాగ్స్ ఉపయోగించినా అంతే ప్రయోజనం కలుగుతోంది. ఈ టీపొడి ప్యాకెట్లు ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో లభిస్తున్నాయి. ఈ టీ పొడిని చైనా, జపాన్ వంటి దేశాలలో కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
Liver Cleaning
ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపటంలో సహాయపడతాయి. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటానికి సహాయపడతాయి. కాలేయ పనితీరు కూడా మెరుగుపడి జీర్ణక్రియ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. కిడ్నీల పనితీరు బాగుండేలా చేస్తుంది. శరీర బరువును తగ్గించటానికి కూడా సహాయపడుతుంది.
cholesterol
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి రక్తప్రసరణ బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.