సినిమా నిర్మాణానికి మురళీ మోహన్ ఎందుకు దూరమయ్యారు…కారణం అదేనట
Murali Mohan Movies :ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి, రాజబాబు పేరుతొ ఎదిగి, అనూహ్యంగా సినిమా రంగంలోకి వచ్చి మురళీ మోహన్ గా మారి ఎన్నో సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లో చేరి, ఆపార్టీ తరపున ప్రచారం చేయడమే కాకుండా 2009ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా పోటీచేసి ఓటమి చెందినా, పట్టు వదలని విక్రమార్కునిలా రాజమండ్రిని వదలకుండా తిరిగి, 2014ఎన్నికల్లో తెలుగుదేశం తరపున మళ్ళీ బరిలో దిగి ఎంపీ అయ్యారు.
ఇలా తెలుగు సినిమా రంగంలో, రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన మురళీమోహన్ జయభేరి ఆర్ట్స్ పేరిట సినిమాలు కూడా నిర్మించారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా జయభేరి మోగించారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న మురళీ మోహన్ నిజానికి హీరోగా వచ్చి, నిర్మాతగా దాదాపు 25 సినిమాల వరకు తీశారు. ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ, 80 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ సినిమాలంటే ప్రాణం పెడతారు. సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరుతెచ్చుకున్న మురళీమోహన్ జయభేరిపై సినిమా నిర్మించి దశాబ్దంన్నర దాటింది.
యాడ్స్ లో కూడా నటించిన మురళీ మోహన్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా అందరితో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే ఇష్టమైన సినిమా రంగంలో సినిమాలు తీయకపోవడం వెనుక మారిన పరిస్థితులే కారణమని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల ఆయన వద్ద కొందరు ప్రస్తావిస్తే, పొరపాటున నష్టం వస్తే, మొత్తం నిర్మాత మీద పడిపోతుందని, అందుకే దూరంగా ఉన్నానని చెప్పారట.
తమినాడులో కరుణానిధి అపోజిషన్‌లో ఉన్నపుడు మణి మొదలు పెడితే, అధికారంలోకి వచ్చాక సీన్ మారిందని, కట్స్ చేసుకుంటూ పొతే సినిమా ఆడలేదని మురళీమోహన్ గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, మధుసూదనరావు, కె విశ్వనాథ్, బాపు, కోడి రామకృష్ణ లాంటి దర్శకులతో కూడా లో బడ్జెట్ సినిమాలు చేసానని అయన వివరిస్తూ,ఇప్పుడు అందరి చుట్టూ తిరగాల్సిన దుస్థితిలో సినిమా చేయడం కష్టమని తేల్చారు