సీతారామయ్యగారి మనవరాలు గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?
Seetharamayya Gari Manavaralu Movie :చాలా సినిమాలు వస్తుంటాయి. కొన్ని హిట్, కొన్ని ప్లాప్ అవుతాయి. కొన్ని క్లాసిక్ సినిమాలు ఇది మన ఇంట్లో జరిగిన కథ అనే ఫీలింగ్ కల్గిస్తాయి. అందులో సీతారామయ్యగారి మనవరాలు ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు , రోహిణి హట్టంగండి , మీనా,తనికెళ్ళ భరణి తదితరులు నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్.
ఈ సినిమా విశేషాల్లోకి వెళ్తే, 1985లో వెంకట హరగోపాల్ అనే రచయిత నవ్వినా కన్నీళ్లే అనే నవల రాసారు. ఆంధ్రప్రభ నవల పోటీలలో మొదటి బహుమతి తెచ్చుకుంది. చాలామంది దగ్గరకు సినిమా తీయమని తిరిగినా ఫలితం దక్కలేదు. అయితే నాలుగేళ్ళతర్వాత దర్శకుడు క్రాంతి కుమార్ సిద్ధమయ్యారు. వి దొరస్వామి రాజుకి విషయం చెప్పగానే ఆయన నిర్మిస్తానని అన్నారు.
సినిమాకు పనికొచ్చేలా రామ్ గోపాల్, క్రాంతికుమార్ స్క్రిప్ట్ రెడీ చేసారు. గణేష్ పాత్రో డైలాగ్స్ రాసారు. తాత పాత్ర చాలా కీలకం. ఎన్టీఆర్, అక్కినేని లలో ఎవరో ఒకరైతే బాగుంటుందని అనుకుంటే ఎన్టీఆర్ రాజకీయాలతో బిజీ అయ్యారు. అక్కినేని దగ్గరకు వెళ్తే, కథ విని తాతయ్య క్యారెక్టర్ వేయడానికి ఒకే చెప్పేసారు. ఇక బాలనటిగా మంచి పేరు తెచ్చుకున్న మీనాను పిలిపించి లంగా ఓణీ వేసి, స్క్రీన్ టెస్ట్ చేసి, ఒకే చేసారు.
మీనాకు నిజంగా హీరోయిన్ గా ఇదే మొదటి సినిమా. రాజా ప్లేస్ లో పృథ్విని తీసుకోవాలని చూస్తే, గెడ్డం పెంచకపోవడంతో తీసేసి రాజాను ఫైనల్ చేసారు. అక్కినేని భార్యగా మామ్మ పాత్ర కోసం 20రోజులు సెర్చ్ చేసి, హేండీ, మలయాళం మూవీస్ లో నటిస్తున్న రోహిణి హట్టంగండిని సెలక్ట్ చేసారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎం ఎం కీరవాణి. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఇలా అందరూ కుదిరారు.
అక్కినేని పుట్టినరోజు సందర్బంగా పద్మాలయ స్టూడియోలో1990 సెప్టెంబర్ 20న సినిమా ఓపెనింగ్. చిరంజీవి, నాగార్జున చీఫ్ గెస్ట్ లుగా వచ్చారు. అయితే విగ్గులేకుండా నటించాలని క్రాంతికుమార్ పట్టుబట్టడంతో చివరకు అక్కినేని ఒప్పుకున్నారు. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. పద్మాలయ, అన్నపూర్ణ స్టూడియోస్ లో 10శాతం తీసి, మిగిలిన భాగం అంతా రాజమండ్రి దగ్గర షూట్ చేసారు.
రాజమండ్రి ,పట్టిసీమ, తదితర ప్రాంతాల్లో 40రోజులు షూటింగ్ చేసారు. 1991జనవరి 11న 30థియేటర్స్ లో రిలీజయింది. రెండు వారాల థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్స్ స్టార్ట్ అయింది. తండ్రి మాటను కాదని ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడి అమెరికా వెళ్ళిపోతాడు కొడుకు. అలా 20ఏళ్ళు అసలు కలుసుకోరు. మనసులో సీతారామయ్య బాధ పడుతుంటే, రోహిణి నలిగిపోతూ ఉంటుంది.
అయితే కూతురు కూతురుకి పెళ్లి జరుగుతుంటే, కొడుకు కూతురు అమెరికా నుంచి వస్తుంది. తండ్రి మరణ విషయం తాతయ్యకు చెప్పకుండా దగ్గరవుతుంది. ఎవరికి వాళ్ళు పోటీ పడి నటించిన ఈ సినిమా అద్భుతంగ పండింది. దాసరి నవ్వించే పాత్రలో కనిపించగా, మురళీమోహన్ గెస్ట్ పాత్రలో కనిపిస్తారు. మొత్తానికి అందరూ బాగా నటించడంతో సినిమా సూపర్ హిట్ అయింది. మీనాకు స్టార్ హీరోయిన్ హోదా వచ్చేసింది. పాటలన్నీ హిట్. అన్ని భాషల్లో డబ్బింగ్ చేయగా సూపర్ హిట్. మూడు నంది అవార్డులు, మూడు ఫిలిం ఫేర్ అవార్డులు ఈ సినిమాకు వచ్చాయి. అప్పట్లో మూడు కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ గైడ్ చెబుతోంది.