భోజనం తర్వాత 1 లడ్డు తింటే…పాదాల అరికాళ్ళ నుండి తల వరకు అన్ని వ్యాధులు నయం
Flax seeds and sesame seeds laddu Benefits In telugu : మనలో కొంత మంది ఏ చిన్న పని చేసినా చాలా తొందరగా అలసిపోతారు. దానికి కారణం ఏమిటంటే శరీరానికి అవసరమైన శక్తి అందక పోవడం. ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకుంటే ఇటువంటి సమస్యలు ఉండవు. ఇటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఒక లడ్డు తయారు చేసుకుందాం.
ఈ లడ్డూను రోజుకి ఒకటి తింటే ఎన్నో రకాల సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ లడ్డు తయారీ కోసం అవిసే గింజలు, నువ్వులు, బాదం పప్పు, బెల్లం ఉపయోగిస్తున్నాం. దీని కోసం ముందుగా పాన్ వెలిగించి నూనె లేకుండా ఒక కప్పు flax seeds, ఒక కప్పు తెల్ల నువ్వులు వేసి సిమ్ లో పెట్టి వేగించాలి.
వేగిన flax seeds, నువ్వులు కాస్త చల్లారాక మెత్తని పౌడర్ గా తయారు చేసుకోవాలి. బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి తురిమిన బెల్లాన్ని వేసి కొంచెం నీటిని కలిపి తీగ పాకం వచ్చేవరకు పొయ్యిమీద ఉంచాలి. తీగపాకం వచ్చాక దానిలో తయారుచేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి.
ఆ తర్వాత కట్ చేసి పెట్టిన బాదంపప్పులను కూడా వేయాలి. మిశ్రమం బాగా కలిసేలా బాగా కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డుగా తయారు చేసుకోవాలి. ప్రతిరోజు ఒక లడ్డు తింటూ ఉంటే రక్తహీనత, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలసట, నీరసం వంటివి ఏమీ ఉండవు. ఈ లడ్డులు ఒకసారి తయారు చేసుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి.
చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరు తినవచ్చు. రోజులో ఏ సమయంలోనైనా తినవచ్చు. ఉదయం సమయంలో తింటే రోజంతా అలసట, నీరసం లేకుండా హుషారుగా ఉంటారు. కాబట్టి కాస్త ఓపికగా ఈ లడ్డును తయారుచేసుకొని తింటే మంచిది. ఈ మధ్య కాలంలో సమస్యలు అనేవి చాలా చిన్న వయస్సులోనే వస్తున్నాయి. అందువల్ల పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.