Chiranjeevi “ఇంటి గుట్టు ” సినిమా గురించి ఈ నమ్మలేని నిజాలు మీకు తెలుసా ?
Chiranjeevi Intiguttu or Inti Guttu Movie: చిరంజీవి ప్రారంభ దశలో సుప్రీం హీరోగా పిలవబడక ముందే కొన్ని సినిమాలు వచ్చి మంచి హిట్ అందుకున్నాయి. అందులో కె బాపయ్య డైరెక్షన్ లో వచ్చిన ఇంటిగుట్టు సినిమా ఒకటి. ఎన్టీఆర్ తో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ తీసి, సూపర్ స్టార్ కృష్ణతో సన్నిహితం గల నిర్మాత డాక్టర్ జివిఎన్ రాజు ఈ మూవీ నిర్మించారు. చిరు,నళిని జంటగా నటించగా, మరో జంటగా చంద్రమోహన్,సుహాసిని చేసారు. చిరు సోదరి పాత్రలో సుహాసిని చేయడం విశేషం.
అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ తండ్రి కొడుకుల నటించి పంచిన వినోదం ఆడియన్స్ ని నవ్వించింది. రావు గోపాలరావు, ప్రభాకరరెడ్డి,గిరిబాబు,నర్రా వెంకటేశ్వరరావు,అన్నపూర్ణ, చలపతిరావు,రావి కొండలరావు,జయమాలిని,అత్తిలి లక్ష్మి , తదితరులు నటించగా, నూతన ప్రసాద్,సారధి అతిధి పాత్రలు వేశారు. పరుచూరి బ్రదర్స్ రచన చేయగా, వేటూరి పాటలు రాసారు. 1964లో తమిళంలో ఘనవిజయం సాధించిన పడక్కర్ కుడుంబమ్ మూవీ ఆధారంగా తెలుగులో తీసిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది.
అయితే ఈ మూవీలో హీరోగా మోహన్ బాబుని అనుకున్నారట. 1983జూన్ 29న మద్రాసు లోని ప్రసాద్ స్టూడియోలో షూటింగ్ కూడా స్టార్ట్ చేశారట. అయితే తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబుని తప్పించి చిరంజీవిని హీరోగా పెట్టారట. ఇక బాపయ్య హిందీ మూవీస్ తో బిజీగా ఉండడంతో కొన్ని సన్నివేశాలను కె ఎస్ ప్రకాశరావు చిత్రీకరించారు. గుంటూరులో శతదినోత్సవం 1985లో చేసారు. 36ఏళ్ళక్రితం విడుదలైన ఈమూవీ అంటే చిరుకి చాలా ఇష్టం. నిజానికి ఈ సినిమాలో పాత్ర మామూలుగానే ఉన్నా సరే,ఫాన్స్ ని ఆకట్టుకునేలా చిరంజీవి నటించాడు. ఫిలిం ఫేర్ అవార్డు అనుకున్నాడు.